ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత శాస్త్ర మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన మన భారత మాత ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్ . గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణిత సిద్దాంతాలను , సూత్రాలను అందించిన అత్యుత్తమ గణిత శాస్త్రజ్ఞుడైన రామానుజన్ గారు తన అపారమైన మేధస్సు తో  భారత దేశపు కీర్తి ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగుర వేసిన వ్యక్తిగా  చరిత్రలో నిలిచిపోయారు. 

శ్రీనివాస రామానుజన్ పూర్తి పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ . 1887 డిసెంబర్ 22న ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈరోడ్ పట్టణంలో తెంగవై (వైష్ణవ) బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస అయ్యంగార్, కోమలతామ్మాళ్ దంపతులకు జన్మించారు. రెండేళ్ల వయస్సు లోనే మశూచి సోకిన, దాన్ని నుంచి బయటపడ్డారు. 

బాల్యంలోనే కాంచీపురం లోని అమ్మమ్మ గారింటికి చేరుకొని స్థానిక పాఠశాల లో ప్రాథమిక విద్యాభ్యాసం ఆరంభించారు. ఇదిలా ఉండగానే ఈరోడ్ ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడంతో , వారి  కుటుంబంతో కుంభకోణం కు  వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. 

చిన్నతనంలోనే గణితం మీద మక్కువ ఏర్పరచుకున్న రామానుజన్ , 13వ నాటికే పెద్దలకే అత్యంత కష్టతరమైన  త్రికోణమితి (TRIGONOMETRY) గణితాన్ని అవపోసన పట్టి  గణిత శాస్త్రం లో అత్యంత కష్టతరమైన జి.ఎస్.కార్ వ్రాసిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మేధమేటిక్స్ లో ఉన్న పలు  అంశాలకు చెందిన 6000 సూత్రాలకు నిరూపణ చేయడానికి తానే సొంతంగా వాటికి సిద్ధాంతాలు వ్రాయడం ప్రారంభించారు. 

హై స్కూల్ విద్యనంతరం కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో చేరిన రామానుజన్ గణితం మీదే ధ్యాస కేంద్రీకృతమై ఉండటంతో పాటుగా మిగిలిన సబ్జెక్టుల మీద ధ్యాస, ఆసక్తి లేకపోవడంతో వరుసగా మూడు సార్లు ఎఫ్.ఏ(ప్రస్తుతం ఇంటర్మీడియట్) లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కానీ అప్పటికే కార్ పుస్తకం లోని 6000 సూత్రాలకు సిద్ధాంతాలను కనుగొన్నారు.
 
ఎఫ్.ఏ లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వెంటనే 8 సంవత్సరాలు వయస్సు ఉన్న జానకి అమ్మాళ్ తో వివాహం జరిపించారు. వైవాహిక జీవితంలో అడుగిడిన రామానుజన్ బ్రతుకు తెరువు కోసం మద్రాస్ వెళ్లి అక్కడి పోర్టు లో 25రూపాయల జీతంతో గుమస్తాగా చేరారు. పోర్టులో పనిచేస్తున్న సమయంలో నే చిత్తు కాగితాల మీద గణితానికి సంబంధించిన పలు సిద్ధాంతాలు వ్రాస్తూ కాలాన్ని గడుపుతున్న సమయంలోనే పోర్టు ఉన్నతాధికారులు వాటిని గమనించి వాటిని మద్రాస్ విశ్వవిద్యాలయం కు పంపగా ఎటువంటి డిగ్రీ లేకుండా గణితం లో అసమాన ప్రతిభ కనబరుస్తూ ఉన్న రామానుజన్ కు ప్రతి నెల 75 రూపాయలు వేతనం మంజూరు చేయడమే కాకుండా  డిగ్రీ  విద్యార్ధులకు ట్యూటర్ గా నియమించింది. 

1913లో ఒక పని మీద మద్రాస్ పోర్టుకు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వాకర్ రామానుజన్ స్వయంగా కనుగొనిన 120 గణిత  సిద్ధాంత పరిశోధన పత్రాలను పరిశీలించి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రముఖ గణిత శాస్త్రవేత్త జి.హెచ్.హార్డీ కి పంపడం ఆయన జీవితం లో కీలకమైన మలుపు. 

ఉన్నతస్థాయి గణిత శాస్త్రవేత్తలు వ్రాయగల ఆ సిద్ధాంత పత్రాలను చూసిన వెంటనే వాకర్ ద్వారా రామానుజన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ప్రారంభించారు. రామానుజన్ అసమాన ప్రజ్ఞ ను గుర్తించిన హార్డీ వెంటనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసేందుకు ఆహ్వానించారు. 

 ఆర్థికంగా వెనుకబడిన రామానుజన్ ఇంగ్లండ్ వెళ్ళడానికి ఆనాటి మద్రాస్ గవర్నర్ , మద్రాస్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు ఆర్థిక సహాయాన్ని అందించడంతో 1914లో ఇంగ్లండ్ వెళ్లారు. 

కేంబ్రిడ్జ్ చేరుకున్న రామానుజన్ , హార్డీ తో కలిసి గణిత శాస్త్రంలో పలు అంశాలపై పరిశోధనలు చేస్తూ మహా మేధావులు సైతం సాధించలేని పలు సమస్యలను పరిష్కరించి పాశ్చాత్య మేధావుల దృష్టి ని తనవైపు రామానుజన్ గారు కేంబ్రిడ్జ్ లో పనిచేస్తున్న సమయంలో సుమారు 27 పరిశోధన పత్రాలు వ్రాసారు. 1729 అనే  మ్యాజిక్ సంఖ్య ను సైతం కనుగొన్నారు. అన్నపానియాలు విసర్జించి అహోరాత్రులు పరిశోధనలోనే  నిమగ్నమై ఉండటంతో అనారోగ్యంతో  38 ఏళ్లకే 1926, ఏప్రిల్ 26న మరణించారు. 

రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన విశేషమైన గాను అత్యంత ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోషిప్ ను పొందారు. 

2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టిన జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించారు.2014లో ఆయన 125వ జయంతి సందర్భంగా ఆ సంవత్సరాన్ని జాతీయ గణిత శాస్త్ర సంవత్సరం గా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: