పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నెల ఆఖరులో ఆరంభమైనా కూడా  సజావుగా సాగలేదు సమావేశాల మొదటి రోజున కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాల తీసుకొని వెనక్కి తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో పెట్టింది,   చట్టాలపై జరగాలని జరగాలని సభ్యులకు   పట్టుబట్టినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజ్యసభలో తొలిరోజే 12 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు ఈ విషయంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.  శీతాకాల సమావేశాలు జరిగిన ప్రతి రోజు రాజ్యసభలో ఏదో ఒక గందరగోళం నెలకొంది సస్పెన్షన్ కు గురైన సభ్యులను తిరిగి సభలోకి రప్పించాలని వారి పై వేసిన సస్పెన్షన్  వేటును రద్దు చేయాలని ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు   ప్రతినిత్యం అడ్డుతగిలారు  రోజూ  ఇదే తంతు నడిచింది. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంపై చైర్మన్ ఎన్నిసార్లు సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కార్యకలాపాలు సజావుగా జరగకపోవడం పై వెంకయ్య నాయుడు చేశారు అసంతృప్తి వ్యక్తం చేశారు
వాస్తవానికి శీతా కాల సమావేశాలు ఆరంభానికి ముందు ఉపరాష్ట్రపతి  వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సభలో చర్చించాల్సిన అంశాలను వారితో పంచుతున్నారు. సభ సజావుగా జరపాలని ప్రజాసమస్యలు పరిష్కారమయ్యేలా సభ్యులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 95 గంటలపాటు సభ జరిగేలా ఆరంభంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అన్న చందంగా సభా కార్యక్రమాలు సాగాయి సభ కేవలం 46 గంటల సేపు మాత్రమే జరిగింది.
కార్యక్రమాల ముగింపు రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  తన ప్రసంగంలో.. ఐయామ్ నాట్ హ్యాపీ అంటూ వ్యాఖ్యానించారు. సభలో సభ్యులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, వ్యక్తిగత అజెండా ఉండకూడదని హితవు పలికారు.  ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అత్యంత విలువైన సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: