రైతులకు కేంద్రం నుంచి శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదాల విడుదల తేదీ ప్రకటించడంతో పీఎం కిసాన్ యోజన కింద 10వ విడత ఎట్టకేలకు రైతుల నిరీక్షణకు తెరపడనుంది. ఇక అలాగే లబ్ధిదారులకు సందేశం కూడా పంపడం జరిగింది.అలాగే జనవరి 1 వ తేదీన ప్రధాని మోదీ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా మాట్లాడనున్నారు. ఇక వారు రైతులకు పంపిన సందేశంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1 వ తేదీ 2022 నాడు మధ్యాహ్నం 12 గంటలకు PM కిసాన్ యోజన కింద 10వ విడతను PM మోడీ విడుదల చేయడం జరుగుతుంది. ఇక అది కూడా జరిగింది. రైతు ఉత్పత్తి సంస్థలకు ఈక్విటీ గ్రాంట్లను కూడా ప్రధాని మోదీ విడుదల చేస్తారని సందేశంలో తెలియజేయడం జరిగింది. అలాగే రైతులు pmindiawebcast.nic.in లేదా దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమంలో చేరవచ్చు.ఇక మీరు కూడా PM కిసాన్ పథకం కోసం నమోదు చేసుకున్నట్లయితే, మీరు ఈ పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరును కూడా చెక్ చేయవచ్చు. ఇక ఇక్కడ ఇవ్వబడిన ప్రక్రియను అనుసరించడం ద్వారా, మీరు జాబితాలో మీ పేరును సులభంగా చెక్ చేయవచ్చు.

ఇక ఈ జాబితాలో మీ పేరును మీరు ఎలా చెక్ చేయాలంటే..

1.ముందుగా PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి.
2. తరువాత రైతుల కార్నర్ ఎంపికపై హోవర్ చేయండి.
3. ఆ తరువాత ఫార్మర్స్ కార్నర్ విభాగంలో, లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయండి.
4. ఇక ఇప్పుడు మీరు డ్రాప్ డౌన్ జాబితా నుండి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ ఇంకా గ్రామాన్ని ఎంచుకోండి.
5. ఆ తరువాత 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి.
6. ఇక లబ్ధిదారుల పూర్తి జాబితా మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, అందులో మీరు మీ పేరును చెక్ చేయవచ్చు.

మీ వాయిదా స్టేటస్ ని ఇలా చెక్ చేయండి ..

1. మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ ని చూడటానికి, మీరు ముందుగా PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై మీరు క్లిక్ చేయండి.
3.తరువాత బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఆ తరువాత మీతో కొత్త పేజీ తెరవబడుతుంది.
5.ఇక మీ ఆధార్ నంబర్ ఇంకా అలాగే మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
6. ఇక మీ స్టేటస్ గురించి పూర్తి సమాచారాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: