విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయంలో బొత్స ఒక్క‌రే కాదు ఎంద‌రెంద‌రో ఉన్నారు. ఎదిగి వ‌చ్చారు. ఆ మాట‌కు వ‌స్తే అశోక్ కు ఉన్నంత పాల‌నా ప‌టిమ కానీ నేప‌థ్యం కానీ బొత్స‌కు లేవు గాక లేవు. వైసీపీ ఒక్కొక్క‌టిగా త‌ప్పులు చేస్తూ ఉంటే వాటికి క‌వ‌రింగులూ క‌ల‌రింగులూ మాత్రం బాగానే ఇచ్చుకుంటూ పోతున్న‌ది అన్న‌ది టీడీపీ వాద‌న. ఈ క్ర‌మంలో మంత్రి బొత్స నిన్న‌టి వేళ అశోక్ గ‌జ‌ప‌తి రాజును అన‌రాని మాట‌లూ అన్నారు. అవును పెద్దాయ‌న మీది స‌ర్క‌స్ పార్టీ  అని అన్నారు.. ఒప్పుకోవాలి..లేదు లేదు ఆ ఫీట్లు ఏమీ లేవు మేం చేసేదంతా రాముడి కోస‌మే అని ఓ గొప్ప అభివృద్ధిని ఆల‌యానికి అందించి బొత్స కానీ వెల్లంప‌ల్లి కానీ మ‌జ్జి వాసు కానీ తమ‌ని తాము నిరూపించుకోవాలి. ఇది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌.. రామ భ‌క్తుల ఆకాంక్ష కూడా!

కొండ‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు
రాముడ్ని ఎవ్వ‌రూ ప ట్టించుకోలేదు
మేం అధికారంలోకి వ‌చ్చాక మంచి అభివృద్ధి
చేస్తున్నాం అని బొత్స అనవ‌చ్చు  
కానీ పెద్దాయ‌న కు గౌర‌వం ఇవ్వ‌కుండా
అన‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రు స‌ర్...

నీలాచ‌లం కొండ‌లు వివాదాల‌కు ఆన‌వాలు అవుతున్నాయి. ఇప్పుడివి బోడి  కొండ‌లు అని స్థానిక వ్య‌వ‌హారంలో చెలామ‌ణీ అవుతున్నాయి. మంత్రిబొత్స కోపానికి, అశోక్ గ‌జ‌ప‌తి రాజు అనే మాజీ కేంద్ర మంత్రి ప‌ట్టుద‌ల‌కు మరియు పంతానికి ఇవి సాక్షి అవుతున్నాయి. రామ‌తీర్థం గొడ‌వ కార‌ణంగా నిన్న‌టి వేళ రెండు పార్టీలూ బాహాబాహీకి దిగాయి. వెల్లంప‌ల్లి  శ్రీ‌ను లాంటి మంత్రులు కనీసం పెద్దాయ‌న వయ‌స్సుకు అయినా మ‌ర్యాద ఇచ్చి ఉంటే బాగుండేది. నిజంగా అధికార పార్టీ స‌ర్క‌స్సు చేయ‌డం లేదు అని నిరూపించి ఆ త‌రువాత ఎవ్వ‌రిని ఎంత మాట అయినా అనొచ్చు. ఓ ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త ఆయ‌న.. రామ తీర్థం కు మాత్ర‌మేనా ఉత్త‌రాంధ్రలో ఎ న్నో ఆల‌యాలు పూస‌పాటి వంశీయుల‌వే క‌దా! ఆ పాటి స్పృహ లేకుండా ఆయ‌న‌పై కోపం అవుతున్నారేంటి?

ఒప్పుకోవాలి ఆల‌య పున‌ర్మిర్మాణ ప‌నులు అన్న‌వి వైసీపీ కి ఓ  సంక‌ల్పం లాంటివి. అవును ఆ సంక‌ల్పం లోభాగంగా నాలుగు కోట్లు కాదు నల‌భై కోట్లు అయినా వెచ్చించ‌వ‌చ్చు. దానిని కూడా ఎవ్వ‌రూ కాద‌న‌రు. కానీ వంశ పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త పేరు లేకుండా
నిన్న‌టి వేళ వెల్లంప‌ల్లి కానీ బొత్స కానీ ఎందుక‌ని త‌మ ప‌రువు తామే తీసుకున్నారు. ఎందుకని ఓ శంకుస్థాప‌న‌కు చెందిన శిలాఫ‌లకంలో బొత్స కానీ వెల్లంప‌ల్లి కానీ అశోక్ పేరు ఉంచేందుకు అభ్యంత‌రాలు వెల్ల‌డి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: