ఇప్పుడు వైసీపీలో ఇదే టాక్ ప్రముఖంగా వినిపిస్తోంది. తాము జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే వచ్చే ఎన్నికల్లో నిండా మునిగి పోతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెగ మదనపడి పోతున్నారట. చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం జ‌నాల చూపు జగన్ వైపు ఉన్నా.. జగన్ చూపు తమపై ఉంటుందో లేదో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారట. ఎమ్మెల్యేలకే కాదు కొందరు ఎంపీలతో పాటు మంత్రులకు సైతం 2024 ఎన్నికల్లో తమకు జగన్ మరోసారి టిక్కెట్‌ ఇస్తారా ? లేదా అన్నది అనుమానమే అని చెవులు కొరుక్కుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ ఈసారి తమకు టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ లేకపోవడంతో వారు సొంతంగా జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంతంగా జనాల్లోకి వెళుతున్నారు. ఆయన తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూస్తూనే ఉన్నాం. అక్కడ రోజా ని వ్యతిరేకిస్తున్న వర్గం వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ రానివ్వమని స‌వాళ్ల మీద సవాళ్లు చేస్తోంది. దీంతో రోజా సైతం పార్టీ అధిష్టానంతో సంబంధంలేకుండా ప్రజల్లోకి వెళ్లి ప‌ట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రాజధాని జిల్లాలో అయిన కృష్ణా - గుంటూరు జిల్లాలో పది మందికి పైగా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదట. పైగా రాజధాని ప్రభావంతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనికి తోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై కూడా కొంత వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరిని కొనసాగిస్తే ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లలో పార్టీ ఓడిపోతుందని తెలుసుకున్న జగన్ చాలామంది సిట్టింగులను పక్కనపెట్టేయాలని నిర్ణయం తీసుకున్నారట.

దీంతో ఇప్పుడు ఈ రెండు జిల్లాల వైసిపి ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్ గా ఉంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోయినా  రెబల్ గా అయిన పోటీ చేసి సత్తా చాటాలని డిసైడ్ అయిపోయార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: