తెలంగాణలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. దీంతో అని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది పార్టీ నేతలు గత కొద్ది నెలలు గా ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికి మూడు నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో పాటు... మరో రెండు నెలల్లో అన్ని పదవులు భర్తీ చేయాలన్న సంకేతాలు రావడంతో ఎవరికివారు పదవుల కోసం లాబీయింగ్ మొదలు పెట్టేశారు.

కొందరు నేతలు కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ దగ్గరకు ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే సమయంలో రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు దగ్గరకుకూడా కొందరు ప్ర‌ద‌క్షిణ‌లు చేసుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు మరికొందరు నేతలు ఆర్థిక మంత్రి హరీష్ రావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి ఉంది.

ఇటీవల భర్తీ చేసిన మూడు పదవుల్లో ఒకటి హరీష్ రావు వర్గీయులకు... మరొకటి కేటీఆర్ వర్గానికి చెందిన నేతల కు దక్కడంతో.. ఇప్పుడు అందరూ ఈ నేతల చుట్టూ నే పరుగులు తీస్తున్నారు. కెసిఆర్ కుమార్తె కవిత సైతం తన వర్గానికి చెందిన కొందరు నేతలకు పదవులు ఇప్పించు కోవ‌డం ద్వారా త‌న ప‌ట్టు నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు జిల్లాల కు చెందిన మంత్రులు కూడా తమ వర్గానికి చెందిన వారికి పదవులు ఇప్పించుకునేందుకు లాబీయింగ్‌ మొదలు పెట్టేశారు. ఇక కెసిఆర్ తర్వాత వారసుడు ఎవరు ? అన్న ప్రశ్నకు నిన్నమొన్నటి వరకు హరీష్ రావు - కేటీఆర్ మధ్య పోటీ ఉంటే ... ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా పోటీ ఉంది. దీంతో చాలా మంది నేతలు కవిత, కేటీఆర్ దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: