నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు...ఈ సారి గెలవకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి..ఖచ్చితంగా గెలవాలనే కాన్సెప్ట్‌తో పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. అందుకే పార్టీలో అనూహ్య మార్పులు చేస్తూ వస్తున్నారు. ఏదైనా మార్పు చేస్తే ఆ నేత అలుగుతారు...ఈ నేత పార్టీ వదిలేస్తారు..అనే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ...ఊహించని విధంగా నియోజకవర్గాల్లో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ స్ట్రాంగ్‌గా ఉన్న నియోజకవర్గాలపై కూడా బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మాచర్ల, తంబళ్ళపల్లె లాంటి నియోజకవర్గాల్లో ఊహించని మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే మాచర్లలో మార్పు చేసేశారు. మామూలుగా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా...అక్కడ ఆయనకు చెక్ పెట్టడం ఈజీ కాదు...ఇప్పటికే అభ్యర్ధులని మార్చిన ఫలితం రాలేదు.

దీంతో టీడీపీలో గతంలో పనిచేసిన మాజీ ఫ్యామిలీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. 1999లో మాచర్లలో టీడీపీ తరుపున జూలకంటి దుర్గాంబ గెలిచారు. అదే టీడీపీకి చివరి గెలుపు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో దుర్గాంబ తనయుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ ఫ్యామిలీని బాబు పక్కన పెట్టేశారు. అయినా సరే మాచర్లలో మార్పు లేదు. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మానందరెడ్డినే ఇంచార్జ్‌గా తీసుకొచ్చి పెట్టారు.

అటు తంబళ్ళపల్లెలో బలంగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి చెక్ పెట్టడానికి...గతంలో టీడీపీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని మళ్ళీ రిటర్న్ తీసుకోచ్చేందుకు చూస్తున్నారు. గతంలో తంబళ్ళపల్లెలో లక్ష్మీదేవమ్మ,..ఆయన తనయుడు ప్రవీణ్‌లు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ 2014లో ప్రవీణ్ వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు...2019లో సీటు రాలేదు...పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ పోటీ చేసి గెలిచారు. ఇటు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాక్టివ్‌గా పనిచేయడం లేదు. దీంతో ప్రవీణ్‌ని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి..తంబళ్ళపల్లె బాధ్యతలు అప్పగించి...పెద్దిరెడ్డి సోదరుడుకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: