సినీ హీరో నాని వ్యాఖ్యలకు అర్థం ఏమిటో నాకు తెలియ లేదని.. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్ ,తిను బండారాలపై దోపిడీ జరుగుతోందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని.. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  అశోక్ గజపతి రాజు ఏమైనా దైవాంశ సంభూతుడా? గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి రాజు మాట్లాడారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఎంతవరకు సరైందని.. అశోక్ గజపతి రాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం..తిరిగి మాపై ఆరోపణలు చేయడం తప్పు  అని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. 

అశోక్ గజపతి రాజు కోసం అధికారులు  ప్రొటో కాల్ ను పాటించారని.. 40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ది చేయలేదని ఫైర్ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  ఉత్తర కుమారుడి లాగా లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. రైతుల ఆత్మహత్యలను దాయాల్సిన అవసరం మాకు లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. చంద్రబాబు పరిపాలన కంటే వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని.. ప్రపంచ బ్యాంకు జీతగాడని కమ్యూనిస్టులు చంద్రబాబును అభివర్ణించారన్నారు మంత్రి కన్నబాబు. ఇప్పుడు తండ్రి, కొడుకులు social media లో కూర్చుని కామెంట్లు చేస్తున్నారని.. దేశం లో సిగ్గు లేని నాయకుడు ఎవరని ఓటింగ్ పెడితే ఒకటి నుంచి 10 స్థానాలు చంద్రబాబుకే వస్తాయన్నారు మంత్రి కన్నబాబు.  రైతులను మోసం చేయబట్టే చంద్రబాబును చెప్పు తీసి కొట్టినట్లు 23 స్థానాలకు పరిమితం చేశారన్నారు మంత్రి కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: