ఒక నాట‌కం న‌డుస్తోంది. అది ఆగ‌దు..ఆగే వీల్లేదు
ఆగితే జ‌గ‌న్ నాట‌కం క్లిక్ కాదు
ప‌వ‌న్ ను సామాజికంగా రాజ‌కీయంగా అడ్డుకునే శ‌క్తి
ఒక‌టి పేర్ని నాని రూపంలోనో లేదా కొడాలి నాని రూపంలోనో
ప్ర‌యోగిస్తుండ‌డం ఓ విధంగా అవ‌రోధాలు త‌ప్ప‌వు సినిమాల‌కు!


శ్యామ్ సింగ రాయ్ విడుద‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ టికెట్ వ్య‌వ‌స్థ కు సంబంధించిన చ‌ర్య ఒక‌టి చ‌ర్చ‌కు వ‌స్తోంది. చాలా థియేట‌ర్లు మూత ప‌డుతున్న త‌రుణాన ఏంచేయాలో పాలుపోక నానితో స‌హా ఇత‌ర హీరోలు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. నాని నేరుగా జ‌గ‌న్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు అధికార పార్టీకి ఇబ్బంది పెడుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ధోర‌ణి ఉంటే జ‌గ‌న్ న‌డిపే నాట‌కం విఫ లం అయ్యే అవ‌కాశం ఉంది. అవును! ఈ డ్రామా అంతా రాజ‌కీయం చుట్టూనే న‌డుస్తోంది. జ‌గ‌న్ కు ఉన్న ప‌ట్టుద‌ల కార‌ణంగానో మాట ప‌ట్టింపు కార‌ణంగానో చాలా మందికి తిండిపోయే ప్ర‌మాదం ఉంది..అయినా కూడా పూర్తిగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెంది న ప్రొడ్యూస‌ర్ల‌ను తొక్కేద్దాం అని భావిస్తున్న వైసీపీ  పెద్ద‌ల‌కు తెలియ‌ని విష‌యం ఏంటంటే ఇలాంటి చ‌ర్య‌లు ముందున్న కాలం లో జ‌గ‌న్ రాజ‌కీయ ఉనికికి ప్ర‌శ్నార్థ‌కం అవుతాయ‌ని కూడా టీడీపీ అంటోంది.


ఆంధ్రావ‌నిలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇద్ద‌రు నానీలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారు. కొడాలి నాని, పేర్నినాని అనే ఇద్ద‌రినీ జ‌గ‌న్ చాలా బాగా ప్రోత్స‌హిస్తున్నారు. ఇదే త‌రుణాన థియేట‌ర్ టికెట్ ధ‌ర‌లు త‌గ్గిస్తూ జీఓ ఇవ్వ‌డం దానిని హైకోర్టు ర‌ద్దు చేయ‌డం వంటికి చక‌చ‌కా జ‌రిగిపోయాయి. కానీ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించిన ఏపీ స‌ర్కారు దీనిపై సంబంధి వ‌ర్గాలు ఏమంటాయో అన్న ఆసక్తితో ఉంది. ఇదిలా ఉంటే జ‌గ‌న్ న‌డుపుతున్న నాట‌కానికి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని సార‌థ్యం వహిస్తున్నారు. ఆయ‌నే టికెట్ విధానంపై కానీ మ‌రో విష‌య‌మై కానీ ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. అయితే జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ జ‌గ‌న్ త‌న దైన రాజ‌కీయం న‌డిపిస్తున్నారు. అదేవిధంగా నాని సినిమాకు కూడా ఇదే నిర్ణ‌యం వ‌ర్తించ‌డంతో ఆ హీరో సినిమా కూడా నానా క‌ష్టాలూ ప‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: