ఎప్పుడు ఎలా ప్రజలని మెప్పించాలో జగన్ బాగా తెలిసినట్లు ఉంది. అయితే జగన్‌కు తెలుసో లేక ప్రశాంత్ కిషోర్‌కు తెలుసో గానీ...కరెక్ట్ టైమ్‌లో జనాన్ని మెప్పించడంలో జగన్ ముందు ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలని ఎంత బాగా ఆకర్షించారో చెప్పాల్సిన పని లేదు. భారీగా ప్రజా మద్ధతు పొంది అధికారంలోకి వచ్చారు. అయితే అధికరంలోకి వచ్చాక జగన్ పాలన ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఆయన పాలనపై ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కొందరికి జగన్ పాలన నచ్చుతుంటే...మరికొందరికి నచ్చడం లేదు. అయితే ఒకోసారి జగన్‌పై మరింత వ్యతిరేకత వచ్చినట్లే పరిస్తితి ఉంటుంది. పైగా ప్రతిపక్ష టీడీపీ...ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. అయితే అవి నిజాలో, అబద్దాలో జనాలకు క్లారిటీ ఉండటం లేదు. కానీ కొందరు నిజమే అని నమ్మే పరిస్తితి ఉంటుంది. అలాంటప్పుడు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు పరిస్తితి ఉంది.

అలాంటి సమయంలోనే జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. కరెక్ట్‌గా గమనిస్తే...ఈ రెండున్నర ఏళ్లలో వ్యతిరేకత వచ్చిన అంశాన్ని డైవర్ట్ చేయడంలో మరో ఇష్యూని వైసీపీ క్రియేట్ చేసేస్తుంది. అలాగే కీలక సమయాల్లో పథకాలు అందిస్తూ ప్రజలని డైవర్ట్ కాకుండా చూసుకుంటున్నారు. అలాగే లాంగ్ టైమ్ అసంతృప్తిగా ఉన్న విషయాలని కూడా ఇప్పుడు మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

ఉదాహరణకు మద్యం విషయంలో...ఇప్పటివరకు నాసిరకమైన సొంత బ్రాండ్లని భారీ రేట్లకు మద్యం అమ్మారు. ఈ అంశంపై మందుబాబుల్లో ఎంత అసంతృప్తి వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ అసంతృప్తిని తగ్గించడానికి జగన్ రెడీ అయ్యారు. మళ్ళీ రేట్లు తగ్గిస్తున్నారు..అలాగే పాత బ్రాండ్లని మళ్ళీ తీసుకొచ్చి మందుబాబులని కూల్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఇదే కాదు...మొదట్లోనే పెన్షన్ పెంచుకుంటూ పోతానని జగన్ హామీ ఇచ్చారు. కానీ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు రూ.250 పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా జగన్ ఎక్కడకక్కడ రూట్ మారుస్తూ..సీన్ మొత్తం మారుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: