కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదిలో 300లకు పైగా మృతదేహాలు కొట్టుకువచ్చాయని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. కరోనా మృతదేహాలను ఖననం చేయడంపై అవగాహన లేక కొందరు.. అంత్యక్రియలకు డబ్బుల్లేక మరికొందరు తమ వారి మృతదేహాలను గంగానదిలో పడేశారని పేర్కొన్నారు. అయితే సెకండ్ వేవ్ సమయంలో దేశంలో సరిపడా బెడ్ లు, ఆక్సిజన్ లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఒమిక్రాన్ రోగులకు అందించే మందులను ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులకు మల్టీ విటమిన్ ఔషధాలతో పాటు పారాసెటమాల్ మాత్రలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరుతున్న ఒమిక్రాన్ రోగుల్లో 90శాతం మందికి గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఇతర ఔషధాలు అవసరం లేదని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడరాదని పేర్కొంది. అలాగే ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250మంది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఆదేశించింది. జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతోనే నడిపించుకోవాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ.. 48గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కానీ తప్పనిసరిగా  తీసుకురావాలని టీటీడీ తెలిపింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర భక్తులను తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి పంపిస్తామని స్పష్టం చేసింది. సర్టిఫికెట్లు లేని భక్తులను వెనక్కి పంపిస్తామని పేర్కొంది. భక్తులు టీటీడీ భద్రతా సిబ్బంది సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాబట్టి భక్తులు కూడా టీటీడీ విజ్ఞప్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: