పాకిస్తాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కాశ్మీర్ ప్రజలు అణచివేతకు గురి అవుతున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. వారికి సాయం చేసేందుకు ఏకీకృత ప్రణాళికలు సిద్దం చేయాల్సిన అవసరం ఉందని ఓఐసీ దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వేదికపై మరో సారి కాశ్మీర్ ప్రస్తావన తీసుకు వచ్చింది పాక్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కాశ్మీర్ తోపాటు ఇజ్రాయిల్ సమస్యలను  పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ లేవనెత్తారు. ఆఫ్ఘనిస్తాన్ అంశంపై చర్చించేందుకు వీరు సమావేశం అయినప్పటికీ ఈ భేటీ తర్వాత విడుదల చేసిన ఇస్లామిక్ డిక్లరేషన్ లో ఇజ్రాయిల్ అంశాన్ని ప్రస్తావించారని ఇటలీ రాజకీయ నిపుణులు స్వర్గీయే రెస్టలీ తెలిపారు.

 ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి ఇజ్రాయిల్ కు సంబంధం లేకపోయినప్పటికీ ఇస్లామిక్ డిక్లరేషన్లో ఇజ్రాయిలే ముఖ్యమైన అంశంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆఫ్గాన్ అంశంపై డిక్లరేషన్లో పెద్దగా వివరాలేవీ పేర్కొనలేదు. ఇస్లామిక అభివృద్ధి బ్యాంకు ద్వారా ఓ ట్రస్టు ఫండును ఏర్పాటు చేసి ఆఫ్గాన్ కి సాయం చేస్తామని చెప్పారు. ఓఐసీ దేశాలు ఈ బ్యాంకుకు నిధులు అందిస్తామని తెలిపారు. అయితే ఎవరెవరు ఏ విధంగా నిధులు అందిస్తారనే విషయంపై డిక్లరేషన్ లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇజ్రాయిల్ తో పాటు కాశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారత దేశ అంతర్గత విషయమైనా కాశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికపై మాట్లాడారు. పాలిస్తీనా, కాశ్మీర్ ఒకేవిధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లో అణచివేతకు గురవుతున్న ప్రజలకు సాయం చేయాలని ఓఐసి దేశాలను కోరారు.

 దీనికోసం ఏకీకృత ప్రణాళికను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కాశ్మీరీ లకు ఓఐసీ చాలా సహకారం అందిస్తోందని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. ఐరాస భద్రతా మండలి నిబంధనల ప్రకారం జమ్ము కాశ్మీర్ పై తీర్మానం  చేయాలని ఓఐసీ కార్యదర్శికి సిఫారసు చేశారు. అయితే డ్రాగన్ కు వంతపాడే ఇమ్రాన్ చైనాలో ఉయ్ గర్ లు అణచివేతకు నోరు మెదపడం లేదు. కానీ భారత్ కు చెందిన కాశ్మీర్ ప్రజల గురించి మాట్లాడడాన్ని రాజకీయ నిపుణులు తప్పుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: