సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ఇక రాజకీయ నాయకులందరూ కూడా తాము పోటీ చేయదలచుకున్న నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దానిపై నివేదికలు తెప్పించుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇటీవలి కాలంలో వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ గెలుపు ఓటములను అంచనా వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అటు ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్న నాయకులందరూ కూడా గెలుపు ఓటములపై సర్వేలు నిర్వహించి కొన్ని నివేదికలు తెప్పించుకుంటున్నారు అన్నది అర్ధమవుతుంది. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో  మంగళగిరిలో విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు.



 కానీ ఊహించని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చిత్తుగా ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ పై ఘన విజయాన్ని సాధించారు. భారీ ఓట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే ఈసారి ఓడిన చోటనే మళ్లీ గెలిచి తీరాలని నారా లోకేష్ దృఢసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో ఇక ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ అటు సర్వేలు నిర్వహించి నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టిడిపి పార్టీకి చెందిన సీనియర్ టీమ్ కూడా ప్రస్తుతం సర్వే నిర్వహించగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ కి బంపర్ మెజారిటీ రాబోతుంది అన్నది నివేదిక ద్వారా బయటపడిందట.



 ఒకప్పుడు వాహనాలపై జగన్ బొమ్మ వేసుకొని తిరగడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు వాహనాలపై జగన్ బొమ్మ వేసుకునేవారు చాలా అగ్గి పోయారట. అయితే తాడేపల్లిలో భూముల ధరలు ఒక్కసారిగా పెరగడంతో అక్కడి ప్రజలందరూ ఆస్తుల్లో మూడోవంతు నాలుగోవంతు అప్పులు చేసి పెళ్లిళ్లు సహా వివిధ ఖర్చులు చేసుకున్నారట. ఆ తర్వాత భూముల విలువ తగ్గిపోవడంతో అక్కడి ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయారట. ఇక ఈ క్రమంలోనే  జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో రాజధాని మార్పు సంబంధించి కూడా వ్యతిరేకత నేపథ్యంలో అటు టీడీపీ వైపు 60 శాతం మంది మొగ్గు చూపుతున్నారని సర్వే నివేదికలో వెల్లడి అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: