ఏమ‌యినా అనుకోండి వైసీపీలో నిర్మాత‌ల‌కు న‌టుల‌కు కొద‌వ లేదు. ఆ మాట‌కు వ‌స్తే కాస్త ఆలోచిస్తే వైజాగ్ ఎంపీ ఓ నిర్మాత.. కొడాలి నాని ఓ నిర్మాత..వ‌ల్ల‌భనేని వంశీ ఓ నిర్మాత..ఇంకా ఎంద‌రెంద‌రో! క‌నుక వీళ్లంతా క‌లిసి మ‌ళ్లీ సినిమా రంగంలో పెట్టుబ‌డులు పెట్టి సినిమాలు తీసి ఇప్పుడున్న ఐదు రూపాయ‌ల టికెట్ రేటుకు సినిమాను ప్ర‌ద‌ర్శించి ఒడ్డెక్కితే చూడాల‌ని ఉంది అని అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు. ఎందుకంటే వీళ్లంతా చాలా ఔత్సాహిక నిర్మాత‌లు మ‌రియు కాస్తో కూస్తో పారిశ్రామిక రంగం తెలిసిన పెద్ద మ‌నుషులు..వీటితో పాటు రియ‌ల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా! క‌నుక వీళ్ల‌లో ఎవ్వ‌ర‌యినా అనీల్ ను హీరోగా ఉంచి ఓ సినిమా తీస్తే చూడాల‌ని ఉంది..అని అంటున్నారు కొందరు.. జ‌న‌సేన అభిమానులు.. లేదు లేదు అనీల్ నిర్మాత గా ఉంటే ప‌వ‌న్ హీరోగా ఓ సినిమా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు అని అంటున్నారు ఇంకొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్..ఏమ‌యినా క‌ష్టం విలువ తెలియాల‌న్నా మార్కెట్ విలువ తెలియాల‌న్నా ఈ రెండింటిలో ఏదో ఒక‌టి త‌ప్ప‌క జ‌ర‌గాల్సిందే అని వ్యంగ్య పూరిత ధోర‌ణిలో కాకుండా వాస్త‌విక ప‌ద్ధ‌తిలోనే మాట్లాడుతున్నారు ఇంకొంద‌రు.

 


ఏం అన్నా అనుకోండి ఏం అన్నా చేసుకోండి "అన్న" నిర్మాత‌గా ఉంటే  ప‌వ‌న్ సినిమా చేస్తాన‌ని అంటున్నార‌ని బ‌య‌ట ఓ టాక్ అబ్బా! ఎందుకంటే అన్న అనీల్ ప‌వ‌న్ కోసం గుండు కొట్టించుకున్న గొప్ప మ‌నిషి క‌నుక మనం ఆ కాంబో కోసం వెయిట్ చేస్తా ఉండాల. అన్న నిర్మాత అయితే ప‌వ‌న్ అస్స‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకోడు. అలానే సినిమా కూడా జ‌స్ట్ ప‌ది అంటే ప‌ది కోట్ల‌కే అయిపోతుంది. ఏం కాదు బండ్ల గ‌ణేశ్ అన్న విధంగా అందుకే ఆయ‌న మ‌న‌కు మంత్రి అయ్యాడు అన్న మాట‌కు వాల్యూ కూడా ఒక్క‌సారిగా పెరిగిపోతుంది కూడా!


 

ఏం లేదు స‌ర్ మీరు నిర్మాత‌గా మారిపోండి..డ‌బ్బులుదేముంది సర్ మన గౌర‌వ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్ పెడ్తారు. లాభ‌మో న‌ష్ట‌మో త‌రువాత మీరు నిర్మాత అయితే నెల్లూరు అంతా ఆనందిస్తుంది.ఎందుకంటే అక్క‌డే పుట్టి అక్క‌డే పెరిగిన వారి క‌న్నా ప‌వ‌న్ కు నెల్లూరు అంటే చాలా ఇష్టం క‌నుక.. మీరు నిర్మాత‌గా అనీల్ యాద‌వ్ క్రియేష‌న్స్ అని స్టార్ట్ చేయండి స‌ర్ బాగుంటుంది.. ఇదీ ప‌వ‌న్ అభిమానుల ఆశ.. ఆకాంక్షలు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp