మంత్రులెవ్వ‌ర‌యినా సామాజిక బాధ్య‌త‌తో ప‌నిచేయాలి. మంత్రులెవ్వ‌ర‌యినా మంచికి అనుసంధానక‌ర్త‌లుగా ఉండాలి. కానీ ఇక్క‌డ ముఖ్య‌మంత్రి భ‌జ‌న త‌ప్ప ఏమీ చేయ‌ని ఏమీ స్పందించ‌ని మంత్రులే ఎక్కువ! వాళ్లే నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడ‌తారు ..తిడ‌తారు..వార్త‌ల్లో నిలుస్తారు..


ముగ్గురంటే ముగ్గురు
వారిలో ఒక‌రు కొడాలి నాని
ఒక‌రు పేర్ని నాని
మ‌రొక‌రు ఆళ్ల నాని
 
నాకు నానీ తెలియ‌దు
తెలిసిన నానీ యే కొడాలి నాని
అని అన్నారొకరు
గ్రేట్ అంటే గ్రేట్
మంత్రి పేరు అనీల్
అవును మాకు నానీ తెలియ‌దు
మాకు తెలిసిన నానీయే హీరో నానీ
చిన్న సినిమాల‌కు పెద్ద దిక్కు
అని అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు


"ఒక  హీరో చుట్టూ ఎంత మంది అని విల‌న్లు ఉంటారో ఎవ్వ‌రికైనా తెలుసా.. ఈ క‌థ‌లో హీరో ఒక్క‌డే కానీ విల‌న్లు మాత్రం ఎక్క‌డిక్క‌డే ఉంటారు. ఉన్నారు కూడా! పోనీ ఈ విల‌న్లు ఏమ‌యినా ఆ హీరోను దాటి ప‌నిచేయ‌గ‌ల‌రా అంటే అదీ లేదు. ఈ సారి ప‌ద‌వి పోతే ఏమీ ఉండ‌దు. అస్స‌లు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. క‌నీస మ‌ర్యాద అన్న‌ది ఇవ్వ‌డం జ‌రిగితే రేప‌టి వేళ అదే ఓ అత్యుత్త‌మ గౌర‌వం వీళ్ల‌కు" అని అంటున్నారు జ‌న‌సైనికులు.



ఈ పాటికే ఈ క‌థ‌లో హీరో ఎవ్వ‌రో తెలిసిపోయింది. తేలిపోయింది కూడా! అవును! గ‌త కొద్ది రోజులుగా వాళ్లే మాట్లాడుతున్నారు. వాళ్లే పోట్లాడుతున్నారు. పైకి ఒకలా,లోప‌ల ఒక‌లా కాకుండా ఒకే ప‌ద్ధ‌తి ఇంటా,బ‌య‌టా లోప‌లా వెలుప‌లా పాటిస్తున్నారు. వారే ఏపీ మంత్రులు. సామాజిక బాధ్య‌త‌తో వీళ్లేం అయినా అడుగుతారా అంటే అదీ లేదు. ఓ డ్యామ్ గేట్లు కొట్టుకు పోయి ఊళ్లూ ఇళ్లూ ఏక‌మ‌యిపోతే ఎవ్వ‌రూ అడ‌గ‌రు ప్ర‌శ్నించ‌రు. పోనీ ధాన్యం కొనుగోళ్లు అనంత‌రం రైతుకు బ‌కాయిలు చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌రూ మాట్లాడ‌రు. అంతెందుకు ఒక బ‌స్సు బోల్తాప‌డి అక్క‌డి ప్ర‌యాణికులు నానా అవ‌స్థ‌లూ ప‌డితే వాటిపై కూడా వీళ్లు స్పందించ‌రు. ఏం చేస్తారు అంటే ఒక్క ప‌వ‌న్ ను ఆయ‌నకు సంబంధించిన సినిమాల‌నూ మాత్రం టార్గెట్ చేసి ఆనందిస్తారు. వినోదిస్తారు. అస‌లు ఖ‌ర్చే లేని వినోదం అని ఒక‌టి ఉంటుంది క‌దా ! తీన్మార్ సినిమాలో చెప్పిన విధంగా ఆ విధంగా వీరిది ఖ‌ర్చే లేని వినోదం. ఎవ్వ‌రికి ఏ బాధ్య‌తా ఉండ‌దు. కానీ ప‌వ‌న్ ను నోటికి వ‌చ్చిన విధంగా తిట్ట‌మ‌నండి హాయిగా తిట్టి వెళ్తారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

ycp