ఏపీలో అధికార వైసీపీకి మంచి పట్టు ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. పార్టీ 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా నెల్లూరు ఎంపీ సీటు తో పాటు ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ గెలుచుకుంది. 2019 సాధారణ ఎన్నికల్లో అయితే వైసిపి ఏకంగా జిల్లాలో ఉన్న వీటితో పాటు తిరుగులేని విజయం సాధించింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు అధికార వైసీపీ లో ఎవ‌రి మాట న‌డుస్తోంది అంటే ప్రధానంగా ఒక నేత పేరే వినపడుతోంది. జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ - మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు.

వీరితో పాటు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేలు గా ఉన్నా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - కాకాణి గోవర్ధన్ రెడ్డి - కిలివేటి సంజీవయ్య - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే వీరిని కాదని జగన్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నే బాగా న‌మ్ముతున్నారట. వేమిరెడ్డి జిల్లా రాజకీయాలపై ఎప్పటికప్పుడు సీఎం జగన్ కు నివేదికలు ఇస్తున్నారట.

ఆయ‌న ఇచ్చే నివేదిక ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రచారం కూడా వైసిపి వర్గాల్లో వినిపిస్తోంది. దీనికితోడు నెల్లూరు జిల్లా వైసీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఇటీవ‌ల కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఈ గ్రూపు తగాదాలు ఉన్నా.. సీఎం జ‌గ‌న్ నేరుగా జోక్యం చేసుకోవ‌డంతో ఇవి కొంత వ‌ర‌కు స‌ర్దు మ‌ణిగాయి. అయితే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వీరందరూ కలిసికట్టుగా పనిచేస్తారు అన్న నమ్మకం లేదు.

ఈ క్ర‌మంలోనే వేమిరెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్యేపై నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారన్న విష‌యం కూడా లీక్ అయ్యింది. ఆ ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని వేమిరెడ్డి తన రిపోర్ట్ లో రాసిన‌ట్టు టాక్ ?  ఏదేమైనా ఇప్పుడు ఈ విష‌యం జిల్లా లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. వేమిరెడ్డి జ‌గ‌న్ కు వేగుగా మారార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: