వైసీపీ నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడినా కూడా చంద్ర‌బాబు అండ్ కో ఇప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో సంయ‌మ‌నంతోనే ఉంది. అంతేకాదు ఇంత‌టి క్లిష్ట‌త‌లోనూ అన్న‌గారి అమ్మాయి ఎంతో బాగా మాట్లాడారు. చెప్పిన నాలుగు మాట‌లు అయినా కూడా అవ‌న్నీ  నేటి వైసీపీ ఆలోచించుకోవాలి అనే విధంగానే ఉన్నాయి. ఎప్పుడూ ద‌య‌క‌ల‌గ‌డం ఓ విష‌యం.. ఇత‌రుల‌కు సాయం అందించ‌డం గొప్ప విష‌యం అని చాట‌డం ఈ ప్రొగ్రాంకు ప్ర‌త్యేకమ‌యిన ఆక‌ర్ష‌ణ.. ఆచ‌ర‌ణ కూ తూగిన మాట.. థాంక్ యూ భువ‌నమ్మ.. అని అంటోంది టీడీపీ

వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న బిడ్డ‌ల‌కు వారి కుటుంబాల‌కు నిలువ నీడ లేని వారికి చంద్ర‌బాబు మరియు ఆయ‌న బృందం మంచిగానే ఆదుకుంది. ఆ విధంగా చంద్ర‌బాబు త‌న మాట నిలబెట్టుకుని రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో మారు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు.
ఏ రాజ‌కీయ పార్టీ చేయ‌ని విధంగా త‌న‌వంతు సాయం చేయ‌డమే కాదు ఆ ప్రొగ్రాంకు త‌న భార్య‌ను ఈ ఉదార‌త‌కు సార‌థ్యం వ‌హించ‌మ‌ని చెప్పారు.


ఈ వారం కూడా రాజ‌కీయాల్లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా చంద్ర‌బాబు నిలిచారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తిరుప‌తిలో వ‌ర‌ద బాధితుల‌కు 48 ల‌క్ష‌లు రూపాయ‌లు పంచి  పెట్టారు. 48 కుటుంబాల‌ను ఆదుకుని దాతృత్వం చాటారు. అదేవిధంగా ఈ దాతృత్వ రీతికి ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నేతృత్వం వ‌హించింది. భువ‌నేశ్వ‌రి విచ్చేసి ఈ కార్య‌క్ర‌మానికి వ‌న్నె తీసుకువ‌చ్చారు. ఎంతో హుందాగా మాట్లాడి స‌భికులను ఆక‌ట్టుకున్నారు. ఆడ‌వారిని అస‌భ్యంగా దూషించిన వారు ఎవ్వ‌రూ బాగు ప‌డ‌లేద‌ని అన్నారు. ఎవ‌రి పాపాన వారే పోతార‌ని అన్నారు. ఆమె వ్యాఖ్య‌ల‌కు కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చారు. య‌థావిధిగా  చంద్ర‌బాబును తిట్టిపోసి స్వామి భ‌క్తి చాటారు. ఇవి ఎలా ఉన్నా భువ‌నేశ్వ‌రి విష‌య‌మై ఇప్ప‌టికీ వైసీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న మాట వాస్తవం.



మరింత సమాచారం తెలుసుకోండి:

tdp