పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంతో భయంకరంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి భయంకరమైన సముద్రంలో ప్రాణాలకు తెగించి ఎంతో మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇలా మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ఎప్పటిలాగానే వాళ్లకు చేపలు దొరుకుతు ఉంటాయి. కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం మత్స్యకారుల వలకు అరుదైన చేపలు చికుతూ.. లాభాల పంట పండిస్తూ ఉంటాయి. దీంతో ఎంతో మంది మత్స్యకారులు అరుదైన చేపలతో భారీగా సంపాదించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా సముద్రంలోకి వేటకు వెళ్లిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారుల వలకు తిమింగలాలు పడటం కూడా చూస్తూ ఉంటాం.


 కానీ అరుదైన చేపలు మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే వలకు చిక్కులు ఉంటాయి. ఇక ఇలాంటి అరుదైన చేపలు దొరికినప్పుడు మత్స్యకారుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారులు రోజు లాగానే సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇటీవల వారికి అదృష్టం వరించింది. అంతర్వేది లోని మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు ఒక అరుదైన చాప దొరకడంతో అదృష్టం వరించింది అయితే. ఈ మత్స్యకారుల వలకు చిక్కింది అంత ఆషామాషీ చేప కాదండోయ్ ఏకంగా ఏడు వందల యాభై కేజీల అరుదైన టేకు చేప.



 ఇక ఇంత భారీ చేప దొరకడంతో మత్స్యకారలు లక్షల్లోనే సంపాదించారు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ చేప కు భారీ డిమాండ్ వుంది. లక్షల్లో ఈ చేపను కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడుతూ ఉంటారు. 750 కిలోలు ఉన్న ఈ అరుదైన చేపను తరలించడం ఎంతో కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక భారీ క్రేన్లు ద్వారా ఈ చేపను బోట్ నుంచి మినీ వ్యాన్ లోకి షిప్ట్ చేశారు మత్స్యకారులు. ఇక ఆ తర్వాత అక్కడినుంచి కాకినాడ మార్కెట్ కు తరలించి అక్కడ అమ్మకానికి పెట్టారు. అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఇలాంటి అరుదైన చేపల దొరుకుతూ ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక 750 కిలోల టేకు చేప దొరకడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు మత్స్యకారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: