జనసేనకు నాలుగైదు జిల్లాల మినహా, మిగిలిన జిల్లాలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రకాశం నుంచి కిందకు వస్తే...నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో జనసేనకు ఏ మాత్రం పట్టు లేదు. అసలు గత ఎన్నికల్లో జనసేన పూర్తిగా డిపాజిట్లు కోల్పోయింది. అంటే ఆయా జిల్లాల్లో జనసేన పరిస్తితి పెద్దగా బాగోలేదని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఆ జిల్లాల్లో జనసేన బలం ఏ మాత్రం పెరగలేదు. కాకపోతే బలం లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పెట్టాలని మాత్రం పవన్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా ఎవరైతే పవన్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారో ఆ నేతలకు చెక్ పెట్టాలని జనసేన ప్రయత్నాలు చేస్తుంది. పేర్ని నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని లాంటి నాయకులు పవన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటారు. ఇక వీరికి నెక్స్ట్ ఎన్నికల్లో ఎగలైన చెక్ పెట్టాలని చూస్తున్నారు. కాకపోతే సొంతంగా మాత్రం జనసేన...ఆ నేతలకు చెక్ పెట్టడం జరిగే పని కాదు.

కానీ జనసేన..ఆ నేతలకు చెక్ పెట్టాలంటే టీడీపీ సపోర్ట్ కావాల్సిందే. టీడీపీ ద్వారానే వారికి చెక్ పెట్టాలి. అంటే టీడీపీకి జనసేన మద్ధతు ఇస్తేనే..ఆ నేతలని ఓడించడం సులువు అవుతుంది. ఇదే క్రమంలో నెల్లూరు సిటీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు చెక్ పెట్టాలని జనసైనికులు చూస్తున్నారు. ఇటీవల అనిల్, ఓ రేంజ్‌లో పవన్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అందుకే అనిల్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. టీడీపీకి గానీ సపోర్ట్ ఇస్తే అనిల్ కాస్త డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో అనిల్, టీడీపీపై 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ అప్పుడు జనసేనకు పడిన ఓట్లు 5 వేలు పైనే. అంటే టీడీపీ-జనసేనలు కలిసి ఉంటే అనిల్‌కు గెలుపు కష్టమయ్యేది. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ఇచ్చి అనిల్‌కు చెక్ పెట్టాలని జనసైనికులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: