ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ తో అల్లాడి పోయాయి అన్ని దేశాలు. ఇక ఇటీవల సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలు మరింతవణికిపోతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటివరకు రెండు దశలలో వ్యాప్తి చెందిన వైరస్ లతో పోల్చి చూస్తే కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిఒక దేశం కూడా మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుంది   అదే సమయంలో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని దేశాలకు రాకపోకలపై కూడా నిషేధం విధిస్తూ ఉండటం గమనార్హం.



 అదే సమయంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నవారికి టీకాలు వేయడమె కాదు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్ అందించడానికి కూడా సిద్ధమవుతున్నాయి కొన్ని దేశాల ప్రభుత్వాలు. అయితే కేవలం మూడవ డోస్ మాత్రమే కాదు ఓమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్ కారణంగా నాలుగో డోస్ కూడా వేయడానికి సిద్ధమైంది ఓ దేశం. కొన్ని దేశాల్లో ఇప్పుడు రెండో వేస్తూ ఉంటే మరికొన్ని దేశాల్లో మూడవ డోస్ వేస్తున్నారు. గానీ అటు ఇజ్రాయిల్ దేశ ప్రభుత్వం మాత్రం ఏకంగా ఓమిక్రాన్ ను సమర్థవంతంగా  ఎదుర్కోవడానికి 4వ డోస్ పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది.


 ఇప్పటికే ఇజ్రాయెల్లో 150 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ నాల్గవ డోస్ అందించినట్లు తెలుస్తోంది... అయితే ఇక నాలుగవ డోస్ తీసుకున్న వైద్య సిబ్బంది ఎంతో ఆరోగ్యంగానే ఉన్నట్లు అక్కడి వైద్య శాఖ తెలిపింది. అయితే ఓమిక్రాన్ ను ఎంతో సమర్థవంతంగా నాలుగవ డోస్  ఎదుర్కోగలదు అని తెలిస్తే వెంటనే దేశ ప్రజలందరికీ నాలుగవ డోస్ పంపిణీ చేస్తామంటూ ఇజ్రాయిల్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టు నెలలోనే దేశ ప్రజలందరికీ కూడా మూడవ డోస్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు నాలుగవ డోస్ కూడా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: