ఏపీలో సినిమా రేట్ల తగ్గింపు పెను వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ రేట్లతో థియేటర్లు నడపలేమని కొందరు థియేటర్ల యజమానులు ఏకంగా సినిమా హాళ్లు మూసేసుకున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్లు కూడా మూతబడుతున్నాయి. అయితే... ఈ విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అసలు తాము సినిమా టికెట్లు తగ్గించలేదని.. గతంలో ఉన్న సినిమా రేట్లే ఇప్పుడు కొనసాగుతున్నాయని మంత్రి కొడాలి నాని ఓ వాదన వినిపించారు.


గతంలో ఉన్న సినిమా టికెట్ల రేట్లను తాము ఎక్కడా తగ్గించలేదని వివరించిన కొడాలి నాని..  కోర్టుల ఆదేశాలతో  సినిమా టికెట్ ధరలు పెంచి దోచుకునేందుకు తాము అవకాశం కల్పించలేదని.. అందుకే తమ ప్రభుత్వంపై ఇలా ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అంటున్నారు.  కమిటీ వేసి టికెట్ రేటు కంటే ఎక్కువగా  రేట్లు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న కొడాలి నాని.. మేం చేస్తోన్న దాని వల్ల ఎగ్జిబ్యూటర్ కు ఎలాంటి నష్టం లేదని వివరణ ఇచ్చారు.


అసలు రూ. 10 లకు సినిమా టికెట్ ఉందని ప్రచారం చేస్తున్నవాళ్లు అసలు విషయం పట్టించుకోవడం లేదని.. అసలు రాష్ట్రంలో లక్ష సీట్లు ఉంటే  వెయ్యి సీట్లు కూడా పది రూపాయల టికెట్లు ఉండవని కొడాలి నాని లాజిక్ పాయింట్ లాగారు. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై పని గట్టుకుని బురద జల్లుతున్నారని.. తమ ప్రభుత్వానికి  ఎవరిపైనా కక్ష సాధింపు లేదని వివరణ ఇచ్చారు.   బడ్డీ కొట్టుకు వస్తోన్న ఆదాయం సినిమా థియేటర్ల యజమానులకు రావడం లేదన్న హీరో నాని మాటలను కోట్ చేస్తూ కొడాలి నాని సెటైర్ పేల్చారు. ఆదాయం లేకపోతే సినిమా థియేటర్ యజమానులు బడ్డీ కొట్టు పెట్టుకుంటారు కదా అని వ్యాఖ్యానించారు.


మొత్తం మీద సీఎం జగన్ తీసుకున్న సినిమా టికెట్ల నిర్ణయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. హమ్మయ్య ఇప్పుడైనా కాస్త ఫ్యామిలీ కలసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చని  సామాన్యుడు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: