కోవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం వైయస్‌.జగన్‌. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగలలోని ఆస్పత్రులుకూడా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు సీఎం వైయస్‌.జగన్‌. నిన్న కొత్త వేరియంట్ మరియు కరోనా విజృంభణ పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా చేయాలని ఆదేశించారు సీఎం వైయస్‌.జగన్‌.
ఇంటింటికీ వెళ్లి వ్యాక్సి నేషన్‌ చేయాలని..  ఫీవర్‌ సర్వే చేసే సమయం లోనే వ్యాక్సినేషన్‌ చేయించు కోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని పేర్కొన్నారు సీఎం వైయస్‌.జగన్‌.


క్రమం తప్పకుండా ఇంటింటి కీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా జరగాలని.. కోవిడ్‌ నివారణ  లో ఇది మంచి యంత్రాంగం కావాలని పేర్కొన్నారు సీఎం వైయస్‌.జగన్‌.  టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతిలలో పోవాలని.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని పేర్కొన్నారు సీఎం వైయస్‌.జగన్‌.  సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని.. వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితి ని సమీక్షిద్దామని పేర్కొన్నారు సీఎం వైయస్‌.జగన్‌.  ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపైన, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. ఆర్టీపీసీఆర్‌ పద్ధతి లోనే పరీక్షలు చేయాలని ఆదేశించారు.  

అలాగే విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్‌ చేయాలన్న సీఎం.. వా రి పై క్రమం తప్ప కుండా రెగ్యులర్‌ గా పరీ క్షలు జరపాలన్నారు.  పాజిటివ్‌ అని తేలి తే ప్రైమరీ కాంటాక్ట్స్‌  కు కూడా వెంటనే పరీక్షలు చేయాలన్న సీఎం వైయస్‌.జగన్‌... ప్రభుత్వ ఆస్పత్రు ల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సమీక్షించారు.  రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం.. ఇవి పూర్తి ఐతే  అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: