అది పక్కా వైసీపీ కంచుకోట...అక్కడ టీడీపీకి పెద్దగా పట్టు లేదు. ఏదో ఒకటి, రెండు సార్లు గెలిచింది తప్ప..మెజారిటీ సార్లు కాంగ్రెస్ గెలిచింది..ఇప్పుడు అక్కడ వైసీపీ హవా నడుస్తోంది. అలా వైసీపీ హవా కోటలో ఇప్పుడు టీడీపీకి మంచి ఛాన్స్ దొరికింది. అయితే ఆ ఛాన్స్ టీడీపీకి సొంతంగా వచ్చింది కాదు..టీడీపీ బలపడటం వల్ల ఛాన్స్ రాలేదు...వైసీపీలో ఉన్న లుకలుకలు టీడీపీకి కలిసొస్తున్నాయి. అలా టీడీపీకి కలిసొస్తున్న వైసీపీ కంచుకోట ఏదో కాదు...నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం.

అసలు ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. ఇంకా ఎక్కువసార్లు, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అది కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సత్తా చాటుతూ వస్తున్నారు. ఈయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు, వైసీపీ నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వైసీపీ అధికారంలో ఉంది. అయినా సరే ఈయనకు పెద్దగా పాజిటివ్ లేదు. ఏదో అధికార బలం మాత్రమే ఉంది గానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ఈయనకు పట్టు తగ్గుతుంది.

పైగా సొంత పార్టీ నేతలే ఈయనకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతున్నారు. మొన్న ఎంపీపీ ఎన్నికల్లోనే పెద్ద రచ్చ అయింది. అలాగే పార్టీ పదవులని సైతం అమ్ముకుంటున్నారని ఉదయగిరిలోని కొందరు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఏ పని కావాలన్న ఎమ్మెల్యేకు మాముళ్ళు తప్పడం లేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్తితి ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేని ఒక అదృశ్యశక్తి నడిపిస్తుందని మాట్లాడుకుంటున్నారు.

ఇక ఉదయగిరిలో వ్యవహారాలని చక్కపెట్టాలని కొందరు నేతలు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మొర కూడా పెట్టుకున్నారట. కానీ గౌతమ్ మాత్రం..తన బాబాయి నియోజకవర్గంలో జోక్యం చేసుకొనని చెప్పేసారట. దీంతో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: