ప్రతిరోజు మీడియా లో ఉంటూ రచ్చబండ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా చెప్పిన రెండు విషయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాస్త హాట్ హాట్ గా మారాయి. రఘురామ కృష్ణంరాజు ప్రతిరోజు వైసిపి ప్రభుత్వంతో పాటు .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చెప్పిన రెండు విషయాలు మాత్రం అధికార పార్టీ వర్గాల్లోనూ చర్చకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపికి ఘోరమైన ఓటమి తప్పదని జోస్యం చెప్పిన రఘురామ కృష్ణంరాజు .. ఆ పార్టీ ఓటమికి గల కారణాలను కూడా ముందే వెల్లడించారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీ ఎస్ ప‌థ‌కం తో పాటు వాలంటరీ వ్యవస్థ ... ఈ రెండూ కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడి పోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి అని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరు అయితే ఓటీ ఎస్ పథకంతో పాటు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన‌ వాళ్లకు దాదాపుగా ఒక కోటి ఓట్లు బోన‌స్ గా వస్తాయని ఆయన చెప్పడం ఆశ్చర్యం గా మారింది.

ఈ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు వ్యవస్థలు పార్టీతో పాటు జగన్ ప్రభుత్వానికి కూడా బాగా చెడ్డపేరు తెస్తున్నాయని ... అసలు ఈ రెండింటినీ అమలు చేయమని జగన్‌కు ఎవరు చెప్పారో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పారు.

ఇక రఘురామ చెప్పినటువంటి వ‌లంటీర్ల పై సొంత పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. కొందరు గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు - ప్రజాప్రతినిధులను కూడా లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని కూడా వైసిపి నేతలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: