రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజమే. ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి రాజకీయ నాయకులు అనేక వ్యూహాలతో ముందుకొస్తారు. ఇక ఆ వ్యూహాలకు ధీటుగా ప్రత్యర్ధి నేతలు కూడా ప్రతి వ్యూహాలు పన్ని చెక్ పెడతారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి వ్యూహ-ప్రతివ్యూహాల రాజకీయం నడుస్తూనే ఉంటుంది. అటు జగన్ గానీ, ఇటు చంద్రబాబు గానీ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఎవరి వ్యూహం సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్తితి.

అయితే గత ఎన్నికల్లో బాబు వ్యూహాలు టోటల్‌గా ఫెయిల్ కాగా, జగన్ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహాలతో బాబు చిత్తు అయ్యారు. ఇప్పుడు కూడా పీకే వ్యూహాలతో జగన్ ముందుకెళుతూ, బాబుకు చెక్ పెట్టడానికి చూస్తున్నారు. ఇక ఈ సారి మాత్రం పీకే వ్యూహాలకు ధీటైన వ్యూహాలని వేయాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు స్ట్రాటజీలతో బాబు రాజకీయం చేస్తున్నారు.

ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్‌తో కలిసి జగన్‌కు చెక్ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి అధికారంలోకి రావాలని బాబు పనిచేస్తున్నారు. పవన్ సపోర్ట్ ఇస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయని, అప్పుడు వైసీపీకి చెక్ పడుతుందని భావిస్తున్నారు. పైగా కాపు ఓట్లు టీడీపీకి బాగా ప్లస్ అవుతాయని అనుకుంటున్నారు.

అయితే ఇక్కడే మరొక విశ్లేషణ కూడా వస్తుంది...టీడీపీకి పవన్ సపోర్ట్ చేస్తే కాపుల ఓట్లు కలిసొస్తాయని, కానీ బీసీ ఓట్లు దూరమవుతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో బాబు కాపు రిజర్వేషన్లని చెప్పి బీసీలని దూరం చేసుకున్నారని, ఇప్పుడు పవన్‌ని దగ్గర చేసుకుని బీసీ ఓట్లని దూరం చేసుకుంటారని అంటున్నారు. కానీ అంత ఈజీగా బీసీ ఓట్లు దూరమయ్యే పరిస్తితి లేదు. గత ఎన్నికల అంటే జగన్ గాలి ఉంది..కానీ జగన్ పాలన అందరూ చూశారు. బీసీ వర్గాల్లో కూడా జగన్ పాలనపై కాస్త అసంతృప్తి ఉంది అలాంటప్పుడు...కాపులు దగ్గరైతే బీసీలు దూరమవుతారనే వాదన సరిగ్గా లేదని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: