మరో నాలుగు నెలల్లో పంజాబ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు దాదాపు ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది. పార్టీ అగ్రనేతల మధ్య ఏ సమస్య వచ్చినా సరే... నేరుగా పార్టీ అధిష్ఠానమే రంగంలోకి దిగుతోంది. స్వయంగా రాహుల్ గాంధీ పంజాబ్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. గతంలో పార్టీ ముఖ్యనేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మధ్య విబేధాలు తలెత్తడంతో.... సిద్ధూకు మద్దతు తెలిపారు రాహుల్. దీంతో సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ స్థానంలో చరమ్ జిత్ చన్నీని నియమించారు. అయితే ఆయనతో కూడా కొద్ది రోజులుగా సిద్ధూ గొడవ పడుతున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో... పంజాబ్ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీదో అని ఇప్పటికే సర్వేలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని కూడా సర్వే రిపోర్టులు వస్తున్నాయి.

అయితే ఎన్నికల కోసం ఇప్పటికే దూకుడు మీదున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూకు బ్రేకులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇప్పటికే సీఎం రేసులో తాను ఉన్నట్లు తన వర్గం నేతలతో సిద్ధూ పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా. అయితే ఈ విషయంపై రాష్ట్ర శాఖకు ఏఐసీసీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనేది ఇప్పుడే ప్రకటించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని కూడా ఆదేశించింది కాంగ్రెస్. పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది అధిష్ఠానం. పార్టీలో వివిధ వర్గాల మధ్య సయోధ్య కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే... లేనిపోని సమస్యలు వస్తాయని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి ఎవరనేది ముందే ప్రకటించకూడదని కూడా హైకమాండ్ భావిస్తోంది. దీంతో ఇప్పుడు హై కమాండ్ నిర్ణయం... సిద్ధూ వర్గానికి పెద్ద బ్రేకు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: