రాజ‌కీయాల‌లో ఈ ఏడాది ఏవేవో మార్పులు జ‌రిగాయి.. రాజ‌కీయాల‌లో ఏవేవో గొప్ప‌నైన చేర్పులూ జ‌రిగాయి. వాట‌న్నింటికీ ఈ ఏడాది సాక్ష్యం అయి నిలిచింది. అందుకు నేనే సాక్షి అన్న విధంగానే ఈ ఏడాది గ‌డిచిపోయింది. గ‌డిచిన ఏడాది నుంచి  నేర్చుకున్న పాఠాలు, దిద్దుకోవాల్సి న పాఠాలు అన్న‌వి గొప్ప‌వి అని భావించి రేప‌టి దిశ‌గా వేసే అడుగులే సుర‌క్షితం..మన జీవితానికి శ్రీ‌రామ ర‌క్ష కూడా! ఇక ఈ ఏడాది శ్రీ‌కాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు పార్లమెంట్ వేదిక‌గా ఎలా పని చేశారు.. మ‌న ప్రాంత స‌మ‌స్య‌లు ఏ విధంగా వినిపించారు.. ఇవి క‌దా కావాలి ఏడాది ముగింపులో! ఇవే ఇక కీల‌కం కూడా!


ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఎంపీ రామూ ఈ సారి కూడా గ‌త ఏడాది మాదిరిగానే ప‌లు మార్లు లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించారు. కేంద్రాన్ని నిల‌దీశారు. వైసీపీ ఎంపీలు ఆ రోజు మాట్లాడిన విధానం క‌న్నా ఎంపీ రామూ మాట్లాడిన ప‌ద్ధ‌తికే మోడీ వ‌ర్గం కూడా మంచి మ‌ద్ద‌తు అందించింది కూడా!



అదేవిధంగా లాక్డౌన్ వేళ‌ల్లో చాలా ఇబ్బందులు ప‌డుతున్న వాళ్ల‌కు అండ‌గా నిలిచారు యువ  ఎంపీ రామూ. ముఖ్యంగా క‌రోనా
ఉద్ధృతి  నేప‌థ్యంలో ర‌క్త నిల్వ‌లు అడుగంటిన వేళ త‌న వంతుగా భ‌వానీ ఛారిట‌బుల్ ట్రస్ట్ త‌ర‌ఫున సంబంధిత శిబిరాలు ఏర్పాటు చేసి రెండు వంద‌ల‌కు పైగా యూనిట్ల‌ను రెడ్ క్రాస్ ద్వారా జిల్లా కేంద్రాస్ప‌త్రికి అందించారు. ఇదొక్కటే కాదు విదేశాల‌లో ఉన్న త‌న స్నేహితుల సాయంతో రిమ్స్ లో పిల్ల‌ల‌కు సంబంధించి వంద ఆక్సిజ‌న్ బెడ్ల‌తో కూడిన ఐసీయూ ను ఏర్పాటు చేసి క‌లెక్ట‌ర్ కు అందించారు. ఇంకా చెప్పాలంటే లాక్డౌన్ వేళ‌లో ఫిల్మ్ న‌గ‌ర్ (హైద్రాబాద్) లో తిండికి లేక అవ‌స్థ ప‌డుతున్న శ్రీకాకుళం వాసుల‌కు త‌న స్నేహితుల ద్వారా నెల‌కు స‌రిప‌డా స‌ర‌కులు అందించారు. వీటితో పాటు మొద‌టి లాక్డౌన్ వేళ త‌న నెల జీతం పీఎం కేర్ కు పంపించిన తొలి ఎంపీ కూడా అత‌నే!



ఇక స‌రిహ‌ద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయ‌క్ ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆయను తోచిన రీతిలో ఆర్థికంగా ఆదుకున్నారు. అదేవిధంగా శ్రీ‌కాకుళం యూత్ ఫోర్స్ స‌మ‌న్వయంతో రేలా రే రేలా జాన‌కీ రావు బృంద గాన స‌భ్యుడు శివ‌ను ఆర్థికంగా ఆదుకున్నారు. వీటితో పాటు ఇంకొన్ని సేవా కార్యక్ర‌మాలు త‌న ఛారిట‌బుల్ ట్ర‌స్టు త‌ర‌ఫున చేశారు. ఆఖ‌రిగా త‌న నియోజ‌క వ‌ర్గ అభివృద్ధి నిధుల‌తో బీఆర్ ఏయూకు ఒక బ‌స్సు ఏర్పాటు చేశారు కూడా! ఈ విధంగా గ‌డిచిన ఏడాది ఆయ‌న‌కు కొన్ని ఆనందాలు ఇచ్చింది..మ‌రికొంత బాధ్య‌త‌నూ పెంచింది. అన్న‌ట్లు ఈ ఏడాది ఆయ‌న ఓ ఆడ‌బిడ్డ‌కు తండ్రి అయ్యారు కూడా! ఎర్ర‌న్న కుటుంబంలో మ‌రో అమ్మవారి రూపం త‌న బిడ్డ అని ఆనందం వ్య‌క్తం చేశారు రామూ.. ఆ వేళ.. ఇదీ ఎంపీ రామూ ఈ ఏడాదికి సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్ట్.




మరింత సమాచారం తెలుసుకోండి:

tdp