ప్రస్తుతం భారత్ దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకుంది. అదే సమయంలో రక్షణ పరమైన  ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. అయితే భారత రక్షణ రంగం మరింత పటిష్టవంతంగా మారడానికి అటు ఇంటెలిజెన్స్ విభాగం అద్భుతంగా పని చేయడానికి వెనుక అజిత్ దోవల్ అనే ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు అని చెప్పాలి. ఈయన పేరు చెబితే చాలు ఏకంగా శత్రుదేశాల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే తనదైన వ్యూహాలతో ఇప్పటికే ఎన్నోసార్లు  భారత భద్రతకు భంగం వాటిల్లకుండా చూసారు అజిత్ దోవల్.



 ఇక ఏదైనా భారత భద్రతకు భంగం వాటిల్లుతుంది అనుకున్నపుడు అజిత్ దోవల్ రంగంలోకి దిగుతారు. కేవలం రోజుల వ్యవధిలోనే సమస్యలు పరిష్కరిస్తారు. తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇలా ప్రస్తుతం భారత భద్రతా సలహాదారుగా కొనసాగుతున్న అజిత్ డోవాల్ భారత దేశ రక్షణకు దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కూడా ఎంతో కీలకం గా మారిపోయారు అని చెప్పాలి. అయితే ఇక అజిత్ ధోవల్ తర్వాత భారత భద్రతకు ఆయన స్థానాన్ని   భర్తీ చేయగల  వ్యక్తి ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే భారత భద్రతకు అజిత్ దోవల్ లాంటి వ్యక్తి కావాలి కాబట్టి ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి ఒక అసిస్టెంట్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత రాయబారిగా చైనాలో పని చేసినటువంటి డైనమిక్ ఆఫీసర్... విక్రమ్ మిస్త్రిని అజిత్ దోవల్ కి తోడుగా మల్టీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ గా నియమిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చైనా కు సంబంధించి అన్ని రకాల వ్యవహారాలు ఈయనకు  అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక ఈయన అనుభవం ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో ఇలాంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అజిత్ ధోవల్ కి తోడు దొరకడంతో మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: