ప్రపంచమంతా కరోనా మ్యుటిషన్స్ తో నానా తంటాలు పడుతోంది. ఎక్కడో దక్షిణ ఆఫ్రికాలో మొదలైన ఈ కొత్త వేరియంట్ ఇపుడు అన్ని దేశాలకు పాకుతూ గ్లోబల్ సమస్యగా మారింది. మన దేశం లోనూ ఒమిక్రాన్ కేసులు 800 దాటాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఇండియాలో ఎలా ఉండబోతుంది..?? ఇదే థర్డ్ వేవ్ అన్న అంశాలపై బ్రిటన్ కు చెందిన కేంబ్రిడ్జ్ సర్వే చేయగా విస్తు పోయే వాస్తవాలు వెలువడ్డాయి. ఇండియా ట్రాకర్ ఆధారంగా పలు విషయాలను వివరించింది.

దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో  ఒమిక్రాన్ ప్రభావం మొదలయ్యింది, రానున్న అతి తక్కువ రోజుల్లోనే వైరస్ విస్పోటనం చూస్తారు. గతంలో లాగా నిత్యం  లక్షల్లో కేసులు వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. ఇది థర్డ్ వేవ్ సూచనే అని ఇంకొద్ది రోజుల్లో అదీ మొదలవుతుందని, అప్రమత్తం అత్యవసరం అని అన్నారు. అయితే కొంతలో కొంత వీరు చెప్పిన ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఈ కొత్త వేరియంట్ వ్యవది మాత్రం చాలా తక్కువ గానే ఉండబోతుందని వారు అంచనా వేశారు. అయితే ఈ అంశం పై మాట్లాడిన కేంబ్రిడ్జ్ వర్సిటీ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ పాల్ కట్టుమన్ భారత్ లో మరికొద్ది రోజుల్లోనే రికార్డ్ స్ధాయిలో కేసులు వెలుగు చూస్తాయి అని చెప్పుకొచ్చారు.

దీనికి తగినట్లుగానే దేశ వ్యాప్తంగా మెల్ల మెల్లగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. నిన్న టి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. ఇక లాక్ డౌన్ లు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఊహ కాదని నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. రోజుకొక వార్త ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దేశంలోని అయిదుకు పైగా రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించారు. వాటిలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు నుండే చర్యలు చేపట్టి  ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించాలని అందరూ ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: