దేశంలో ఒమి క్రాన్ ముప్పు రోజురోజుకు ఎలా పెరుగుతుందో ?  చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై తో పాటు మహారాష్ట్రలో కేసుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతుంది. ముంబై లో ఇప్పటికే మూడో దశ మొదలైనట్టు కూడా తెలుస్తోంది. మంగళవారం ఒక రోజులో కేసులు ఏకంగా 70 శాతం పెరిగాయి. ఒక ముంబైలో నే కేసు ల తీవ్రత రోజుకు పది వేలకు వెళ్లిపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో గత వారం కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఢిల్లీలోనూ కేసులు 70 శాతం పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆంక్షలు అమలు చేస్తోంది. ముంబై లో మూడో దశ మొదలైందన్న‌ హెచ్చరికలతో ప్రజలు సైతం కచ్చితంగా నిబంధ‌న‌లు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో కొత్తగా 235 కరోనా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 40 వేలకు పైగా నమూనాలు పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలోనూ ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్‌ కేసులు తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ డెల్టా విజృంభిస్తే వైద్య వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుంద‌న్న ఆందోళ‌న లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌త వారం రోజుల్లో యూర‌ప్ తో పాటు అమెరికా, ఫ్రాన్స్ ల్లో కూడా కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డం తీవ్ర ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మ‌రో వైపు ఫిబ్ర‌వ‌రి నాటిక ఈ కేసుల తీవ్ర‌త బాగా పెరిగి పోతుంద‌ని చెపుతున్నారు. అప్పట‌కి మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఏదేమైనా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోసారి కరోనా క‌మ్మేస్తుంద‌నే చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: