ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే రూ.75 కే మ‌ద్యం ఇస్తామ‌ని కాషాయ నేత సోమూ వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌తో.. బుధ‌వారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ న‌డిచింది. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంట‌ర్ వేశారు. `వావ్‌.. వాట్ ఏ స్కీమ్‌.. వాట్ ఏ షేమ్‌` అంటూ ట్విట్ట‌ర్ వేధికంగా స్పందించారు. అధికారం కోసం ఏపీ బీజేపీ నేత‌లు దిగ‌జారిపోయి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిపడ్డారు. అయితే, కేటీఆర్ ట్వీట్ పై నెటిజ‌న్‌లు కౌంట‌ర్ వేస్తూ ఎదురు దాడికి దిగారు. తెలంగాణ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 31న అర్థ‌రాత్రి వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇచ్చిన జీవో కాపీల‌ను ట్వీట్ట‌ర్ పోస్ట్ చేస్తూ వైర‌ల్ చేశారు.


 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా వైన్స్‌ల‌కు అనుమ‌తి ఇవ్వడంపై మండిప‌డ్డారు. ఇత‌ర పార్టీల‌పై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసే ముందు తాము ఏం చేస్తున్నామో దాని గురించి ఆలోచించాల‌ని ట్విట్ట‌ర్‌లో సూచించారు. దీంతో పాటు ఐదారేళ్ల క్రితం చిన్నారి ర‌మ్య యాక్సిడెంట్ కేసును ప్ర‌స్తావిస్తూ.. మైన‌ర్లు తాగి చేసిన యాక్సిడెంట్‌లో ఆ కుటుంబంలో న‌లుగురు చ‌నిపోయారు. ఇప్ప‌టికీ ఆ ఫ్యామిలీ జీవ‌చ్ఛ‌వంగానే మిగిలిందని.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మైన‌ర్ల‌కు మందు అమ్మిన ప‌బ్బు, బార్‌కు మాత్రం  లైసెన్స్ మళ్లీ రిన్యూవ‌ల్ చేశారు.. సూపర్ అంటూ ఎద్దేవా చేశారు.  


   ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ టీపీ అధినేత ష‌ర్మిల టీఆర్ఎస్‌, బీజేపీ పై ట్విట్ట‌ర్ వేధిక‌గా సెటైర్లు వేశారు. బీజేపీది చీప్ లిక్క‌ర్ రాజకీయ‌మ‌ని, టీఆర్ఎస్ ది కాస్ట్లీ  పాలిటిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. మీరంతా మ‌ద్యం పేరుతో ర‌క్తం పీల్చే నాయ‌కుల‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న బీజేపీకి అనుమ‌తికి కొవిడ్ గుర్తుకు వ‌స్తుంది  కానీ, మ‌ద్యం అమ్మ‌కాల‌కు కొవిడ్ గుర్తుకు రాదా అంటూ బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గీతామూర్తి ప్ర‌శ్నించారు. మొత్తానికి కేటీఆర్ మ‌ద్యం ట్వీట్ తిరిగి ఆయ‌న‌కే వ‌ర్తించింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: