కాలం చకచకా మారిపోతుంది. ఇక కాలానుగుణంగా మనిషి ఆలోచనా తీరులో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వినూత్నమైన ఆలోచన తో ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే మనిషి ఆలోచన ఎన్నో అద్భుతాలకు కారణం అవుతుంది అనే చెప్పాలి. మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తుండడం కారణంగా  కొత్త అవసరాలు కూడా పుట్టుకు వస్తున్నాయ్. దీనితో  మనిషి తన అవసరాలను తీర్చుకునేందుకు కొత్త ఆవిష్కరణలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే మనదేశంలో కాస్త టెక్నోలజీ తక్కువగా ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రంరోడ్డుపై నడిచే వాహనాలు అటు నీళ్లల్లో కూడా ప్రయాణిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 అంతేకాదు ఇకనీటి అంతర్భాగం నుంచి కూడా ప్రయాణించే రైలు సదుపాయం కూడా విదేశాలలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇలా రోడ్డుపై నడిచే బస్సులు.. వీటిలో దూసుకుపోయే  రైలు చూసాం కానీ ఏకంగా బస్సు రైలు పట్టాలపై పరుగులు పెట్టడం ఎవరైనా చూశారా. దాదాపు ఎవరు చూసి ఉండరు. మరికొన్ని రోజుల్లో ఇలాంటి బస్సు అందుబాటులోకి రాబోతోంది అన్నది తెలుస్తుంది. అచ్చం రైలు పట్టాలపై పరుగులు పెట్టినట్లు గానే.. అటు బస్సు కూడా పట్టాలపైపరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం జపాన్ వినూత్నమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్ట పోతుంది అన్నది తెలుస్తోంది.


 రోడ్డు మార్గం తో పాటు రైలు మార్గం పై కూడా ఎంతో వేగంగా దూసుకుపోయే మినీ బస్సును ఇటీవలే జపాన్ లో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రోడ్డు మార్గం గుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో రైలు మార్గం గుండా వెళ్లేందుకు ఈ బస్సు ద్వారా అవకాశం ఉంటుందట. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక ఈ మినీ బస్సులు తయారు చేసినట్లుతెలుస్తోంది. ఇక ఈ వినూత్నమైన ఆవిష్కరణ ఎంతో అద్భుతం అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా టెక్నాలజీ లో వస్తున్న మార్పులకు ఇక ఈ ఆవిష్కరణ ఒక నిలువుటద్దం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: