గత ఎన్నికల్లో రాష్ట్రంలో కీలకంగా ఉన్న వర్గాలు టీడీపీకి దూరం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో గెలుపోటములని డిసైడ్ చేసే బీసీ, ఎస్సీ, కాపు వర్గాలు టీడీపీకి దూరం జరిగాయి. ఈ వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపుకు వెళ్ళాయి. దీంతో వైసీపీకి భారీగా సీట్లు వచ్చేశాయి. అయితే దూరమైన వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఎలాగైనా ఆ వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ వర్గాలని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూడు వర్గాలు జగన్ ప్రభుత్వంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కువ వ్యతిరేకతని ఎదురుకుంటుంది. రిజర్వడ్ సీట్లలో మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. అటు బీసీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో కూడా టీడీపీ కూడా పికప్ అవుతుంది.

ఇక కాపు వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాల్లో కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానాలని మళ్ళీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పవన్‌తో పొట్టుకోవడానికి బాబు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బాబుతో పొత్తు ఉంటే కాపులు మళ్ళీ టీడీపీ వైపుకు వస్తారని భావిస్తున్నారు.

అదే సమయంలో కాపు వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వంగవీటి రాధా చేత...బ్యాగ్రౌండ్‌లో కాపులని మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పైకి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ఉన్న రాధా...వెనుక మాత్రం కాపు కోటల్లో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిసింది. అంటే రాధా, పవన్‌లతో కాపుల మద్ధతు దక్కించుకోవాలని బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: