శ్రీకాకుళం జిల్లా : వైసీపీ సర్కార్‌ పై  టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టి న రోజున పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని  ప్రారంబించారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు.   ఓటిఏస్  పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేవరకు టి డి  పి  పోరాడు తుందని...  ఎన్ టి ఆర్ నుండి చంద్రబాబు వరకు కట్టిన ఇల్లపై  దుర్మార్గంగా  డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహించారు అచ్చెన్నాయుడు.   టిడిపి హయాంలో  రద్దు చేయలేదేందుకని బోత్సా  అంటున్నారు...  మీరు ఇంత దుర్మార్గులు అని  మేం ఊహించలేదని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు.   కేవలం డబ్బులు కోసమే వైసిపి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చారని.. ఎక్కడా లేని విదంగా దేశ చరిత్రలో  మూడులక్షల తోంబై వేల కోట్లు  అప్పు వాడారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు అచ్చెన్నాయుడు.   

ఏపి కి ఏ బ్యాంక్ అప్పు ఇవ్వడం లేదని.. ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేక ఓటిఏస్ తో డబ్బులు దోపిడి మొదలు పెట్టారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. మీ మ్యానిపేస్టోలో ఏముంది ?  మ్యానిఫేస్టోలో 5 లక్షల ఇల్లలో  ఓక్కో ఇల్లు అయినా నిర్మించారా ? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.   ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములు  వర్షం పడితే సముద్ర ల్లా తయారయ్యాయని...  వాటిని మేం వద్దంటే , అడ్డుకుంటున్నారని మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.   మీరు కట్టనటువంటి ఇల్లు కు మీరు ఏలా డబ్బులు వసూలు చే స్తారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. ఏవరూ ఓటిఏస్ కట్టోద్దు.... మేం వస్తున్నాం .. మేం ఉచితంగా ఇస్తామన్నారు అచ్చెన్నాయుడు.  బల వంతం కాదంటూనే కలెక్టర్ లకు,ఆర్డివోలకు సచివాలయ సిబ్బంది కి టార్గెట్ పెట్టి వసూలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: