వస్త్రాలపై జీఎస్టీను 5 శాతం నుంచి 12 శాతంగా పెంచే ప్రతిపాదన చేనేత రంగాన్ని కలవరపెడుతోంది. చేనేత, వస్త్ర పరిశ్రమపై ఈ జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనిమంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన నిర్మలాసీతారామన్‌కు ఓ లేఖ రాశారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచడం దారుణమని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో చేనేత, వస్త్ర పరిశ్రమలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆయన అన్నారు.


ఇవాళ దిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగుతుంది. ఈ జీఎస్టీ మండలి సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షత వహిస్తారు. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధాన అజెండాగా జీఎస్టీ మండలి భేటీ అవుతోంది. హేతుబద్ధీకరణపై రూపొందించిన నివేదికను ఈ సమావేశంలో సమర్పిస్తారు. ఈ నివేదికను రాష్ట్రాల మంత్రుల కమిటీ సమర్పిస్తుంది. ఈ సమావేశంలో చేనేత, వస్త్రాలపై జీఎస్పీ పన్ను పెంపు ప్రతిపాదనపై చర్చించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


ప్రజావ్యతిరేకమైన ఈ నిర్ణయా న్ని పునఃసమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్. ఇటీవలి కాలంలో  నూలు, రసాయనాలు, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌, రవాణా వ్యయం వంటి ఖర్చులు భారీగా పెరిగాయని కేటీరఆర్ గుర్తు చేశారు. ఈ సమస్యలతోనే ఇబ్బందిపడుతున్న చేనేత, వస్త్ర పరిశ్రమలు.. ఇప్పుడు పన్ను పెంపు కూడా తోడైతే మరింత ఇబ్బంది పడుతుందని తెలిపారు. జీఎస్టీని 12 శాతానికి పెంచితే వస్త్ర ఉత్పత్తుల ధరలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.


కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తానికి చేనేత, వస్త్ర పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రధానంగా రూ. వెయ్యి లోపు ధరలో దుస్తులు కొనే మధ్యతరగతి వినియోగదారులకు జీఎస్టీ పెంపు పెను భారం అవుతుందని మంత్రి కేటీఆర్ తన లేఖలో తెలిపారు. మరి నిర్మలా సీతారామన్ మంత్రి కేటీఆర్ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: