31 డిసెంబర్ వచ్చిందంటే చాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమైపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే 31 డిసెంబర్ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మందుబాబులు అందరికి కిక్కిచే విధంగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలను పై ఏదైనా ఆంక్షలు విధిస్తుంది అని అనుకుంటున్న సమయంలో ఏకంగా మందు బాబులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.


 సాధారణంగా మద్యం షాపులు కేవలం రాత్రి పది గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటాయి. కానీ న్యూ ఇయర్ స్పెషల్ గా ఏకంగా రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పబ్బులు క్లబ్బులు హోటళ్లకు కూడా అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీంతో మందుబాబులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ ఫుల్లుగా తాగి తాగుతూ ఊగాలి అని భావించారు. ఇలాంటి సమయంలోనే అటు పోలీసులు మాత్రం మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు  చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక క్లబ్బులు పబ్బులు కు పెట్టింది పేరుగా ఉన్న బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట మూడు ప్రాంతాలలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అయితే రాత్రి పది గంటల తర్వాత అడుగడుగున వాహనాల తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒక జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని తొమ్మిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబోతున్నారు. ఇక బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు వేర్వేరు చోట్ల తనిఖీలు జరగబోతున్నాయి.ఇలా మద్యం తాగి వాహనం నడిపితే ఆరు నెలల జైలు తో పాటు పది వేలు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr