ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి అనేక రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ-జనసేనల గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే..వైసీపీకి చెక్ పెట్టగలవని, లేదంటే ఓట్లు చీలిపోయి వైసీపీకే బెనిఫిట్ అవుతుంది. అందుకే వైసీపీకి ఈ సారి గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదంటే టీడీపీ-జనసేనలు కలవాల్సిందే అని తెలుస్తోంది. అయితే రెండు పార్టీలు కలిస్తే బెనిఫిట్ ఉంటుంది.

రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. దాదాపు రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. కాకపోతే రెండు పార్టీలతో పాటు ఏ పార్టీ కలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీతో జనసేన ప్రయాణిస్తుంది. అటు టీడీపీకి అనుకూలంగా సి‌పి‌ఐ పనిచేస్తుంది. ఇక ఇక్కడ బీజేపీని కలుపుకుటే టీడీపీ, సి‌పి‌ఐని వదిలేయాల్సిందే.

అలా కాకుండా సి‌పి‌ఐని కలుపుకుంటే...జనసేన, బీజేపీని వదిలేయలి. ఎందుకంటే కమ్యూనిస్టులు, బీజేపీ ఒకచోట ఉండరు. ఈ రెండిటిలో ఏదొకటి జరగాలి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా అడ్వాంటేజ్ ఉండొచ్చని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం...బీజేపీని కలుపుకోవచ్చని చెబుతున్నాయి.

బీజేపీ వల్ల పావలా లాభం లేదని,ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ లేదని, పైగా రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమి లేదని, కాబట్టి ఆ పార్టీతో పొత్తు వద్దని అంటున్నారు. కొద్దో గొప్పో ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉందని, వారితోనే ముందుకెళితే బెటర్ అని మాట్లాడుతున్నారు. ఇదే విషయంలో టీడీపీ సీనియర్ నేత, మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సైతం క్లారిటీ ఇచ్చారు.

వైసీపీ నేతల అరాచకాలకు ప్రజలు విసుగెత్తిపోయారని, రాష్ట్రంలో బిహార్‌ తరహాలో పాలన సాగుతోందని,  ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంటే బీజేపీని ఇందులోకి తీసుకురాలేదు. టీడీపీ-జనసేనతో పాటు కమ్యూనిస్టులు కలిస్తేనే బెటర్ అన్నట్లు షరీఫ్ చెప్పారు. మరి పొత్తుల విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో?

మరింత సమాచారం తెలుసుకోండి: