వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... భారత్‌లో ప్రస్తుతం అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వం నడుపుతున్న నేతల్లో జగన్ అగ్రస్థానంలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 22 స్థానాలను గెలుచుకుంది వైసీపీ. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే.... జగన్ రికార్డును ఎవరు చేరిపేయలేదు. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ లను వైసీపీ సొంతం చేసుకుంది. 90 శాతం పంచాయతీలు వైసీపీ ఖాతాలో చేరాయి. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే... తాడిపత్రి, దర్శి, కొండపల్లి తప్ప... మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురుతోంది. చట్టసభల్లో జగన్ మెజారిటీ ప్రత్యర్థులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కూడా. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న జగన్‌కు... ప్రస్తుతం హైకోర్టు భయపెడుతోంది. అందుకు ప్రధాన కారణం జగన్ తీసుకున్న నిర్ణయాలే. దేశ రాజకీయాల్లోనే వినూత్నమైన నిర్ణయాలతో జగన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను రద్దు చేసిన వైఎస్ జగన్... రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రెండేళ్ల క్రితం జగన్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే 2019 శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి... ఆమోదింప చేసుకున్నారు. వాటికి గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే... ఈ బిల్లుకు మండలిలో ఎదురుదెబ్బ తగలడంతో.. మండలినే రద్దు చేయాలని ప్రతిపాదించారు. అయితే న్యాయ ప్రక్రియలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు చిక్కులు ఎదురయ్యాయి. మండలి రద్దు బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండేళ్లుగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు.. మహాపాదయాత్ర పేరుతో అమరావతి టూ తిరుమల పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో హైకోర్టులో చిక్కులు ఎదురవ్వడంతో... ఆ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు రద్దు చేసింది. కానీ... త్వరలోనే మరో బిల్లు తెస్తామని చెప్పుకొచ్చారు జగన్. మడమ తిప్పేది లేదంటూ ఉన్న జగన్‌ మాటకు ఇక్కడ బ్రేక్ పడినట్లుగా అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: