పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే రెండు, మూడు నియోజకవర్గాల్లో కమ్మ వర్గం ప్రభావం ఉంటుంది. అందుకే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కమ్మ నేతలే పోటీ చేస్తూ ఉంటారు. గత రెండు ఎన్నికల్లో వెస్ట్ రాజకీయాల్లో నలుగురు టీడీపీ కమ్మ నేతలు యాక్టివ్‌గా ఉన్నారు. అయితే 2014లో గెలిచిన ఆ నలుగురు...2019 ఎన్నికల్లో ఓడిపోయారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు, తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ, నిడదవోలులో బూరుగుపల్లి శేషారావులు 2014లో గెలవగా, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

మరి ఈ కమ్మ నేతలు కాంబో 2024 ఎన్నికల్లో ఏమన్నా సక్సెస్ అవుతుందా? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని గమనిస్తే సక్సెస్ అయ్యేలా ఉంది. అయితే ఈ కాంబోలో బూరుగుపల్లిని సైడ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ఆయన్ని సైడ్ చేస్తే...మిగిలిన ముగ్గురు పరిస్తితి ఒకసారి చూసుకుంటే...దెందులూరులో చింతమనేని బాగా మెరుగైన స్తితిలో ఉన్నారు. గత ఎన్నికల తర్వాత వెస్ట్‌లో మొదట పుంజుకున్న నాయకుడు ఈయనే. దెందులూరులో చింతమనేనికు పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

అటు తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ సైతం పికప్ అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఈయన తణుకులో బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం దీంతో తణుకు ప్రజలు మళ్ళీ అరిమిల్లి వైపు చూస్తున్నారు. ఒకవేళ పవన్ గానీ టీడీపీకి సపోర్ట్ ఇస్తే తణుకులో అరిమిల్లి గెలుపు ఆపడం కష్టమే. అలాగే ఉంగుటూరులో గన్నీ కూడా బాగానే పికప్ అయ్యారు. రెండున్నర ఏళ్లలో చాలావరకు పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల్లోపు ఇంకా కష్టపడి పనిచేస్తే...ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ జెండా ఎగిరే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: