ప్ర‌పంచ‌మంతా 2022 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో మునిగి తేలింది. 2021 కి వీడ్కోలు ప‌లికి కొత్త సంవ‌త్స‌రానికి అంద‌రూ ఘ‌న‌స్వాగతం ప‌లికారు. ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ ఎంతో ప్ర‌త్యేకం. క‌రోనా కార‌ణంగా దాపురించిన ద‌రిద్రం ఈ ఏడాది అయినా వ‌ద‌లాలి అని, అందరి జీవితాలు బాగుండాల‌ని అంద‌రూ కోరుకుంటూ ఉన్నారు. ఇక మ‌ద్యం బాబుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మామూలు స‌మ‌యంలోనే వారినీ ఆప‌డం క‌ష్టమ‌వుతుంది. ఇక ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ల స‌మ‌యంలో మ‌ద్యం ఏరులై పారాల్సిందే. కానీ పీక‌ల దాక తాగితే అది ఇక ప్ర‌మాద‌మే. మ‌న స్టామినాకు మించి తాగిన మందు అర‌గ‌క‌పోగా.. అన‌వ‌స‌ర రోగాల‌ను తీసుకొస్తుంది అని మ‌రిచిపోవ‌ద్దు.

మ‌ద్యం సేవించ‌డం.. పార్టీ ఎంజాయ్ చేయ‌డం అటుంచితే.. పొద్దున లేచిన త‌రువాత హ్యాంగ్ ఓవ‌ర్ న‌ర‌కం చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. హ్యాంగ్ ఓవ‌ర్ పెగ్గు వేస్తామంటారా..? అంత‌క‌న్న ముందు ఇంటి చిట్కాలు పాటించి తాగిన మ‌త్తును ఇలా వ‌దిలించుకోండి. రాత్రి అంతా తాగి ఉన్న వీరురాలా.. పొద్దున లేవ‌గానే మీ త‌ల ప‌ట్టేయ‌డం ఖాయం అనిపిస్తుంది. అతిగా మందు తాగ‌డం వ‌ల్ల అందులో విట‌మిన్లు పోలు అంద‌క మీ బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. పొద్దున లేవ‌గానే.. మొద‌లు ఎంత నీరు తాగితే అంత మంచిది.

ఉద‌యం లేవ‌గానే కొంచె మంచి నీళ్లు తాగిన త‌రువాత‌.. కొంత గ్యాప్ ఇచ్చి నిమ్మ‌ర‌సంలో చిటికెడంత తేనే క‌లిపి తాగండి. ఈ మిశ్ర‌మంలో పొర‌పాటున కూడా చ‌క్కెర కల‌ప‌వ‌ద్దు. అది మొద‌టికే మోసం.. రాత్రి తాగిన‌ది మామూలు మందా..! రెండు పెగ్గులు ప‌డిన త‌రువాత అస‌లు ఏమి తాగుతున్నామో.. ఎంత తాగుతున్నామో తెలియ‌కుండానే తాగేసే మ‌హానుభావులు చాలా మందే ఉన్నారు. ఉద‌యం లేవ‌గానే త‌ల‌ప‌ట్టేస్తుంది. ఆ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. పుచ్చ‌కాయ‌లు, ద్రాక్ష‌లు వంటి నీరు ఎక్కువ‌గా ఉన్న పండ్లు తినడం బెట‌ర్‌.  అందులో కొంచెం అల్లం వేసినా మంచి ఫ‌లిత‌ముంటుంది. ఫుల్లుగా తాగడం ద్వారా మ‌న బాడీలో ఉండే పోటాషియం, మెగ్నీషియం స్థాయిలు ప‌డిపోతాయి. వాటిని తిరిగి నింప‌డానికీ రెండు అర‌టిపండ్లు తిన‌డం ద్వారా మ‌త్తును దించుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: