అమెరికాకు చెందిన మరిసా ఫొటియో అనే మహిళ షికాగో నుంచి ఐస్ లాండ్ వెళ్లే విమానం ఎక్కింది. గొంతు నొప్పిగా ఉండటంతో.. బాత్ రూమ్ కు వెళ్లి స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ తేలింది. దీంతో అటెండెంట్ కు విషయం చెప్పి.. విమానం ల్యాండ్ అయ్యే వరకు 3గంటల పాటు బాత్ రూమ్ లోనే గడిపింది. గత నెల 19వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణీకులకు కరోనా సోకకుండా ఆమె చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు.

ఇక మన దేశంలో జ్వరం, తలనొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, డయేరియా, అలసట లాంటి లక్షణాలున్న ప్రజలను తక్షణం పరీక్షించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ లక్షణాలున్న వారు వెంటనే ఐసోలేట్ అయ్యేలా హోం ఐసోలేషన్ నిబంధనలు పాటించేలా చూడాలంది. శుక్రవారం దేశంలో 16వేల కేసులు రాగా.. కొద్ది రోజుల కేసుల సంఖ్యతో పోలిస్తే ఇది భారీ పెరుగుదలగా చెప్పొచ్చు.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24గంటల్లో 22వేల 775కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 406మంది కరోనా కాటుకు బలికాగా.. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4లక్షల 81వేల 486మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 1,431 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. యూఏఈ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్టు అధికారులు చెప్పారు.  









మరింత సమాచారం తెలుసుకోండి: