ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ఎంత అతలాకుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. కరోనా దెబ్బతో ఇప్పటికే కోట్లాది మంది ఈ వైరస్ భారిన పడ్డారు. లక్షల్లో మరణాలు సంభవించాయి. ప్రపంచం మొత్తం రెండు సంవత్సరాలుగా ఏ రోజు ఏం జరుగుతుందో ? అని కంటి మీద కునుకు లేకుండా ఉంటోంది. అస‌లు ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ లు పూర్తి గా కుదేలు అయిపోయాయి. ఈ క‌రోనా లేక‌పోతే ప్ర‌పంచం మ‌రో వంద సంవ‌త్స‌రాల ముందు ప‌రిగెడుతూ ఉండేది.

గత రెండు నెలలుగా కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న టైమ్ లోనే ఇప్పుడు కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. విదేశాల్లో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో ప్రపంచం మొత్తం మరోసారి లాక్డౌన్ తప్పదా అన్న భయాందోళనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మనదేశంలోనూ జనవరిలో కరోనా మూడవ దశ వస్తుందా ? అన్న ఆందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచాన్ని మరో వ్యాధి కమ్మేస్తోంది. ఇజ్రాయెల్లో ఫ్లొరోనా కరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఫ్లొరోనా అంటే కోవిడ్ - 19 ఇన్‌ఫ్లూయెంజా అంటే డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్. దీని తీవ్ర‌త మ‌రి భ‌యంక‌రంగా ఉంటుంది.

ఇది కూడా శ‌రీరం పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతుంద‌ట‌. ఈ వ్యాధి తీవ్ర త పెరిగితే అస‌లు దీనిని క‌ట్ట‌డం చేయ‌డం కూడా చాలా క‌ష్టం అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెపుతున్నారు. ఆ దేశంలో తొలి కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం తో పాటు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం అక్క‌డ నాలుగో ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొనసాగుతోంది. అక్కడ రోజుకు సగటున 5 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మ‌రి ఈ వైర‌స్ ను ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: