గత కొద్ది రోజులుగా  ఏపీలో రాజకీయాలనేవి చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో  నేతలు రచ్చ సృష్టిస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు  చంద్రబాబు వర్సెస్ జగన్ రచ్చ నడిచింది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియా ముందుకు వస్తూనే ఉంటారు నేతలు. అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి చీప్ సోము వీర్రాజు మద్యంపై  సంచలన విషయాలు చెబుతున్నారు. అయితే ఆయన మరో సంచలనమైన విషయంతో మీడియా ముందుకు వచ్చారు. మరి ఏం మాట్లాడారో తెలుసుకుందామా..! ఆయన మద్యం  గురించి మాట్లాడితే తనపై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇటీవల విజయవాడలో జరిగిన బిజెపి సభలో చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇస్తానని అటువంటి మాటకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.

ఇదే అంశాన్ని 2024 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో పొందుపరుస్తామని తెలియజేశారు. లిక్కర్ విషయంలో నేను చేసిన కామెంట్ పేద వారిని దృష్టిలో పెట్టుకొని ఆ కామెంట్స్ చేశానని, తాను సారాయి వీర్రాజు కాదని బియ్యం వీర్రాజు అని,  సిమెంట్ వీర్రాజు అని కోడిగుడ్డు వీర్రాజు అని కౌంటర్ ఇచ్చాడు. పేదవాళ్ల రక్తం తాగుతారా అని, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతారా అని అన్నారు. నేను పేద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన టువంటి అంశమేనని అన్నారు.

అసలు బాటిల్ ఖరీదు, మొత్తం సీసాతో సహ  ఆరు రూపాయలని,  ఇంత తక్కువ వచ్చే దాన్ని 250 రూపాయలు అమ్ముతున్నారని, నేను దీన్ని ప్రోత్సహించ లేనని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెబుతూనే ఈ ముఖ్యమంత్రి  మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని, దీన్ని తెలుగు తల్లులు అడగాలి అని తెలియజేశారు. ఇవన్నీ ఆలోచిస్తే సారాయి వీర్రాజు అని ఎందుకు రాస్తారు అని, మరి ఇప్పుడు బియ్యం వీర్రాజు అని  రాయమని, సిమెంట్ వీర్రాజు కోడిగుడ్ల వీర్రాజు అని రాయమని వ్యంగ్యంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: