నూత‌న సంవ‌త్స‌రం బ‌హుమ‌తిగా షేక్‌పేట వంతెన‌ను కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డితో క‌లిసి తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌ మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. ఎస్ఆర్‌డీపీ కార్య‌క్ర‌మం కింద రోడ్డు నిర్మాణం చేప‌ట్టామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాలు లేకుండా గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధించామ‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. రీజ‌న‌ల్ రింగ్‌రోడ్డు కూడా త్వ‌ర‌లోనే పూర్త‌య్యే విదంగా చూస్తామ‌ని.. వెల్ల‌డించారు. కంటోన్మెంట్ మూసివేసిన ర‌హ‌దారుల‌ను తెరిపించాలి అని ఈసంద‌ర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని కోరారు.  షేక్‌పేట వంతెన‌పై కిష‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. 


ఇక షేక్‌పేట పై వంతెన న‌గ‌రంలో ఉన్న‌టువంటి పొడ‌వైన పై వంతెన‌ల‌లో ఒక‌టి.  ఈ వంతెన హైటెక్ సిటీ ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీర్చ‌నున్నది. ముఖ్యంగా టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడ‌లి వ‌ర‌కు షేక్‌పేట నాలా రోడ్డుపై నిర్మాణ‌మైంది. ప్ర‌స్తుతం.. మెహిదీప‌ట్నం, అత్తాపూర్ ల నుంచి ఐటీ కారీడార్‌ల‌కు వెళ్లాలంటే.. వాహ‌న‌దారులు నిత్యం నర‌కం చూస్తారు అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా మెహిదీప‌ట్నం, అత్తాపూర్, దిల్ సుఖ్‌న‌గ‌ర్‌, కోఠి త‌దిత‌ర ప్రాంతాల నుంచి గ‌చ్చిబౌలి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ వంటి కారిడార్‌ల‌ను కూడా క‌లిగి ఉన్న‌ది.

 
అయితే ఐటీ కారీడార్‌, నాన‌క్‌రామ్‌గూడ‌,  బాహ్య వ‌ల‌య ర‌హ‌దారి గుంఆ లింగంప‌ల్లికి వెళ్లే వారు. ఈ రోడ్డునే ఆశ్ర‌యిస్తారు. గోల్కొండ‌, కుతుబ్ షాహీ, టూంబ్స్‌కు వెళ్లే వారికీ ఇదే దారీ. ఉద్యోగులు స‌మ‌యానికి కార్యాల‌యాల‌కు చేరుకోక‌పోవ‌డ‌డం.. క‌ర్భ‌న ఉద్గారాల‌తో కాలుష్యం పెరిగి ఐటీ కారిడార్ వాతావ‌ర‌ణం దెబ్బ‌తిన్న‌ది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఐటీ కారిడార్‌లో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ లో భాగంగా వేరువేరుగా  వంతెన నిర్మాణం చేప‌ట్టింది. అయితే రూ.333.55 కోట్ల వ్య‌యంతో దాదాపు 2.8 కిలోమీట‌ర్ల దూరం వెడ‌ల్పు 24 మీట‌ర్లు, 74 ఫిల్ల‌ర్ల‌తో వంతెల నిర్మాణం కొన‌సాగింది అని పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్ల‌డించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే రాష్ట్రం మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌ని చెప్పారు మంత్రి కేటీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: