ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయా..? ఒకవేళ ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే.. పార్టీల‌న్నీ రెడీగా ఉన్నాయా..? అంటే అవును అనే పేర్కొంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత‌, విపక్ష‌నేత చంద్ర‌బాబునాయుడు దీనిపై మ‌న‌సులో ఉన్న‌ మాట బ‌య‌ట‌పెట్టారు. ఇవాళ మీడియాతో ముచ్చటించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితినీ అంచెనా వేయ‌లేక‌పోతున్నా అని పేర్కొన్నారు. ప‌లువురు సీఎంలుగా ప‌ని చేసినా.. ఆర్థిక వ్య‌వ‌స్థ మాత్రం ఛిన్నాభిన్నం చేసిన సీఎం  ఎవ్వ‌రూ లేరు అన్నారు. ఆర్థిక విధ్వంసం జ‌రుగుతుంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీసారు.

పారిశ్రామిక వేత్త‌లు మొద‌లుకుని రోజు కూలీ వ‌ర‌కు పొరుగు రాష్ట్రాల‌కు వ‌ల‌స పోతూ ఉన్నారు. గ‌తంలో భువ‌నేశ్వ‌ర్ నుండి విశాఖకు వ‌చ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుండి భువ‌నేశ్వ‌ర్ కు వెళ్లుతున్నారు. ఏసీబీ, సీఐడీల‌ను కంట్రోల్‌లో పెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తూ ఉన్నారు. గౌర‌వానికీ భంగం క‌లుగుతున్న‌ద‌ని భ‌య‌ప‌డి సైలెంట్‌గా ఉంటున్నారు. ఈ గొడ‌వ‌లు ఎందుకు అని.. ఇంకొంద‌రూ వ‌ల‌స పోతూ ఉన్నారు. ప్ర‌భుత్వం అరాచ‌కాలను ప్ర‌స్తుతం ప్ర‌జలు భ‌రిస్తూ ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని ప్ర‌జ‌లు తేలుస్తార‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు.
 
ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌స్తే సిద్ధంగా ఉన్నామ‌ని.. పొత్తుల‌పై ప్ర‌శ్న‌లు ఊహ‌జ‌నితం. నేను దానిపై ఇప్పుడు స్పందించను. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు రోడ్డుక్క‌లేదు. దీంతో బ‌తికి పోయాడు సీఎం జ‌గ‌న్‌. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మావేశమ‌వుతాం. ప్ర‌జా ఉద్య‌మాల‌ను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని, లీడ‌ర్ల ప‌ని చేయ‌కుంటే మారిపోతారు. పార్టీ ఎవ‌రి కోసం త్యాగాలు చేయ‌దు అని, ప‌ని చేయ‌ని ఇన్‌చార్జీల‌ను ప‌క్క‌న పెట్టేస్తాం అని ఖ‌రాఖండీగా చంద్ర‌బాబు చెప్పారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగం పూర్తిగా దిబ్బ‌తిన్న‌ద‌ని, దిగుబ‌డులు త‌గ్గాయ‌ని వివ‌రించారు. ఒక‌ప్పుడు అన్నపూర్ణ‌గా ఉన్న రాష్ట్రంలో దిగుబ‌డుల్లో వెనుక బ‌డింది. మిర్చి పంట పూర్తిగా న‌ష్ట‌పోయిందని, టీడీపీ హ‌యాంలో బిందు సేద్యం 90 శాతం స‌బ్సీడీ మీద ఇచ్చాం. ఇప్పుడు అస్స‌లు ఆ ప్ర‌స్తావ‌నే లేద‌ని.. ట్రాక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ ఎంతో చేసింది. వ్య‌వ‌సాయానికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన‌ది శూన్య‌మ‌న్నారు చంద్ర‌బాబు. టీడీపీ అభివృద్ధి కంటే జ‌గ‌న్ ఏదో చేస్తాడు అని ప్ర‌జ‌లు భావించార‌ని, ఇప్పుడు ఆ భ్ర‌మ‌లు తొలుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. మ‌రింత విస్తృతంగా పోరాటాలు చేస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: