ఇటీవలి కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా వస్తువు  కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కేవలం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఇంటి ముందుకు అన్ని వస్తువులు వచ్చి వాలిపోతున్నాయి. అంతలా టెక్నాలజీ లో మార్పు వచ్చింది. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అయితే ఎక్కువమంది ఆన్లైన్లోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ తో పాటు వివిధ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆర్డర్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి.


 ఇక ఎంతో మందికి ఇలాంటి సేవలు అందించేందుకు ఆటోఅటు ఎన్నో రకాల ఈ కామర్స్ కంపెనీలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వినియోగదారులందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎన్నో ఈ కామర్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆన్లైన్ వేదికగా ఆర్డర్లు చేస్తే బెటర్ అంటూ అటు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కొంతమందికి ఆన్లైన్ ఆర్డర్ లు చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. ఆన్ లైన్ లో ఒక వస్తువు బుక్ చేస్తే చివరికి డెలివరీ అయ్యేది మాత్రం మరో వస్తూ ఉంటుంది. డెలివరీ అయిన పార్సిల్ ఓపెన్ చేసి చూసి అవాక్కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు ఎన్నో పెరిగిపోయాయి అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తి యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఆపిల్ ఫోన్ ఆర్డర్ చేసాడు. అమౌంట్ పూర్తిగా కట్టేసాడు. ఇక ఎప్పుడెప్పుడు ఫోన్ డెలివరీ అవుతుందా అని ఎదురు చూశాడు.  తీరా చూస్తే ఊహించని షాక్ తగిలింది. ఫోన్ డెలివరీ తర్వాత పార్సల్ ఓపెన్ చేసి చూసి ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే  అందులో లక్ష రూపాయలు చేసే యాపిల్ ఫోన్ కాదు క్యాడ్బరీ చాక్లెట్ దర్శనమిచ్చింది  వెంటనే డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేశాడు సదరు కస్టమర్.

మరింత సమాచారం తెలుసుకోండి: