కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.ఇక దేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రోజుకు పదివేల కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇక ఇది కొంత వరకు ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే దేశాన్ని కరోనా రెండు వేవ్‌లు తెగ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళనలు చాలా ఎక్కువవుతున్నాయి. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఇక్కడ తన ప్రతాపం చూపిస్తోంది. గత డిసెంబర్ 2వ తేదీన దేశంలో మొదటి రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగింది.ఇక ఇప్పుడు ఆ సంఖ్య కూడా 1400పైగా పెరిగింది. అయితే ఇందులో ఎక్కువ మంది ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా కూడా ఈజీగా కోలుకుంటున్నారు.ఇక ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్నా కాని దీని ప్రభావం మాత్రం స్వల్పంగానే ఉంటోంది. కాబట్టి ఇవి కొంత ఊరటనిచ్చే అంశాలు.ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఆంక్షలు కూడా విధిస్తోంది. క్రిస్మస్ ఇంకా న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది.ఇక డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ కేసుల పెరుగుదలలో వేగం కనిపిస్తుండటంతో ప్రభుత్వం నిర్ణయాన్ని సవరించడం జరిగింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టాలనే ఉద్దేశంతో కరోనా ఆంక్షలు జనవరి 10వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం తెలిసిందేంటంటే ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా బహిరంగ, సామూహిక సమావేశాలు అనేవి పూర్తిగా నిషేదం.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, దుకాణాలు, మాల్స్, సంస్థలు ఇంకా అలాగే ఇతర ఆఫీసులకు వెళ్లే వారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలి. ఆయా ఆఫీస్ లను కూడా తరచుగా శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాల దగ్గర థర్మల్ స్కానర్‌లతో టెంపరేచర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే అందరూ ఖచ్చితంగా భౌతికదూరం పాటించాల్సి ఉంటుంది.స్కూల్స్‌, కాలేజీలు ఇంకా ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలి. అందరూ కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.ఇక బహిరంగ ప్రదేశాల్లో కనుక వ్యక్తులు మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: