చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయిన మహమ్మారి కరోనా వైరస్ రూపాంతరం  చెందుతూ పట్టి పీడిస్తూనే ఉంది. ఒక దశ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అంటూ ఊపిరిపీల్చుకున్న సమయంలో   కొత్త  వేరియంట్ రూపంలో మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది కరోనా. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్ లు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఒకవైపు వాక్సిన్ వేసుకొని పోరాటానికి సిద్ధం అయినప్పటికీ ఎంతో మంది పై  వైరస్ మాత్రం పంజా విసురుతూనే ఉంది. ఇకపోతే ఇప్పటికే అగ్రరాజ్యాల లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన  ఓమిక్రాన్ మరింత  భయపెడుతుంది.


 చూస్తూ చూస్తుండగానే ఓమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా పాకిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మొత్తం మళ్లీ కఠిన ఆంక్షల లోకి వెళ్ళి పోతున్నాయి. కొన్ని దేశాలలో అయితే లాక్ డౌన్ విధించే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా రోజురోజుకు కరోనా వైరస్ మహమ్మారి అందరిని భయపెడుతుంది.  దీంతో కొత్త వేరియంట్ ఏదైనా వెలుగులోకి వచ్చింది అంటే చాలు అందరూ వణికిపోతున్నారు. అయితే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ అందరిని భయపెడుతూ ఉండగా ఇక ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.



 ఇటీవలే ఇజ్రాయెల్ దేశంలో మరో కొత్త వేరియంట్ను గుర్తించారు వైద్యులు. గర్భంతో ఉన్న ఒక మహిళలో ఈ కొత్త వేరియంట్ను ఉన్నట్లు గుర్తించారు. కరోనా, ఇన్ఫ్లూయెంజా వైరస్ ల తో కూడిన డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు రకాల వైరస్ లు కలిసి పంజా విసురుతున్నాయ్ అంటూ వైద్యులు తెలిపారు  ఈ కొత్త రకం పేరు  ఫ్లోరోనా అని నామకరణం చేశారు వైద్యులు.  మనుషుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే దానిపై ఇక శరవేగంగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. మరికొన్ని రోజుల్లో ఈ వైరస్ మనుషులపై ఎంత ప్రభావం చూపుతుంది అన్న విషయాలను చెప్ప పోతున్నట్లు తెలుస్తోంది  ఇప్పటికే ఉన్న వేరియంట్ లతో  అందరూ భయపడి పోతుంటే కొత్త వేరియంట్ అనేసరికి మరింత వణికిపోతున్నారు ప్రపంచ ప్రజానీకం.

మరింత సమాచారం తెలుసుకోండి: