తెలుగుదేశం పార్టీని భవిష్యత్‌లో నడిపించే నాయకుడు ఎవరంటే? టీడీపీ శ్రేణులంతా నారా లోకేష్ పేరు చెబుతారు...ఎంత కాదు అనుకున్న ఆయనకే టీడీపీ పగ్గాలు దక్కుతాయని అంతా అనుకుంటున్నారు. అందుకే గత కొన్నేళ్ళ నుంచి చినబాబుని పైకి లేపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల తర్వాత చినబాబులో మరింత దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. టోటల్‌గా చినబాబు మారిపోయారు..ప్రత్యర్ధులపై దూకుడుగా వెళుతున్నారు. అలాగే జిల్లాల పర్యటనకు వెళ్ళి పార్టీ నాయకులని కలుస్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా ఉంటున్నారు.

అసలు మొన్నటివరకు చంద్రబాబు ఇంటికే పరిమితం అవ్వగా, చినబాబు మొత్తం చూసుకునే వారు. ఆయనే మొత్తం తిరిగేసేవారు. కానీ ఈ మధ్య ఏమైందో గానీ చినబాబు పార్టీలో కనిపించడం లేదు. వేరే జిల్లాల పర్యటనలకు కూడా పెద్దగా వెళ్ళడం లేదు. ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు గానీ,..మీడియాలో మాత్రం కనిపించడం లేదు. కేవలం మంగళగిరిలోనే తిరుగుతున్నారు గానీ...వేరే నియోజకవర్గాలకు వెళ్ళడం లేదు.


అదేంటి మొన్నటివరకు చినబాబు ఎక్కడ పడితే అక్కడకు వెళ్లిపోయారు...ఇప్పుడు ఏంటి మంగళగిరకే పరిమితమయ్యారు...పైగా మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదని, చినబాబుని టోటల్‌గా సైడ్ క్యారెక్టర్ చేసేశారని కొందరు తమ్ముళ్ళకు డౌట్లు వస్తున్నాయి. అయితే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం...చినబాబుని ముందు పెట్టడం వల్ల...ఆయనే సీఎం అభ్యర్ధి అన్నట్లు ప్రచారం వస్తుందని, వైసీపీకి ఈ ప్రచారం బాగా ఉపయోగపడుతుందని, అందుకే చినబాబుని కాస్త సైడ్ చేసినట్లు తెలుస్తోంది.

అందుకే చంద్రబాబే మొత్తం చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీడియా సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబే అన్నితానై చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల వరకు ఇదే పరిస్తితి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. చినబాబుని ఇంకా ఇప్పటిలో బయటకు తీసుకొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అంటే ఎన్నికల వరకు చినబాబుది సైడ్ క్యారెక్టరే.  


మరింత సమాచారం తెలుసుకోండి: