ఏపీలో ఫ్యాన్ హవా నిదానంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వన్‌సైడ్‌గా ఫ్యాన్ హవా నడిచిన విషయం తెలిసిందే. ఫ్యాన్ గాలి కాస్త సునామీ మాదిరిగా విరుచుకుపడింది. ఆ సునామీలో సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. అయితే ఆ సునామీ ఇప్పుడు బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. సునామీ గాలులు కాస్త మామూలు గాలులుగా మారుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో అదే పరిస్తితి కనిపిస్తోంది.

ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలి చాలా తగ్గినట్లే కనిపిస్తోంది. ఏదో అధికార బలం ఉంది కాబట్టి...ఆ బలంలో ఫ్యాన్ బలం తగ్గినట్లు కనిపించడం లేదు. కానీ కరెక్ట్‌గా చూస్తే సగం ఫ్యాన్‌కు డ్యామేజ్ అయినట్లే ఉంది. జిల్లాలో రాజకీయం చాలావరకు మారిపోయింది. అసలు జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్న విషయం తెలిసిందే. ఒక్క విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మినహా, మిగిలిన 15 మంది వైసీపీ వైపే ఉన్నారు.

వల్లభనేని వంశీతో కలుపుకుని వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. ఇక ఈ 15లో కొందరు ఎమ్మెల్యేల పరిస్తితి కాస్త దారుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అంటే జగన్ గాలి, టీడీపీపై వ్యతిరేకత, జనసేన విడిగా పోటీ చేయడం లాంటి అంశాలు వైసీపీకి బాగా కలిసొచ్చింది. అందుకే ఎక్కువమంది గెలిచేశారు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. జగన్ గాలి తగ్గుతుంది...అప్పుడు ఉన్న గాలి ఇప్పుడు లేదు...వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది...టీడీపీ బలపడుతుంది.

పైగా టీడీపీతో జనసేన కలిసేలా ఉంది...ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే కృష్ణాలో సగం మంది ఎమ్మెల్యేలు జెండా పీకేసేలా ఉన్నారు. ఈ సారి జిల్లాలో ఫ్యాన్ హవా ఉండేలా కనిపించడం లేదు. సగం డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇక ఎన్నికలనాటికి ఇంకా పరిస్తితి మారితే...వైసీపీకి తిప్పలు తప్పవు. అలా కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరిస్తే పరిస్తితి మారే ఛాన్స్ ఉంది. లేదంటే అంతే సంగతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: